Corona in US: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5.. సింగపూర్ నుంచి అమెరికాకు వ్యాప్తి
అమెరికాను ఈ వేరియంట్ వణికిస్తోంది. ఆ దేశంలో ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో 40శాతం కేసులకు ఈ వేరియంటే కారణం. న్యూయార్క్‌లోని ఆసుపత్రుల్లో చాలా మంది రోగులు ఈ వేరియంట్‌తో బాధపడుతున్నారు.
అమెరికాలో సరికొత్త కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని వేరియంట్ల కన్నా ఇది వెరీ డేంజరస్. డెల్టా వేరియంట్ కంటే ఇది 5 రెట్లు ప్రమాదకరం.. అంతే కాదు అత్యంత వేగంగా ఈ వైరస్ విస్తరిస్తుందనే వార్తలు వింటేనే వణికిపోవాల్సిన పరిస్థితి. కరోనా అనే మహమ్మారి మన జీవితంలోకి ప్రవేశించి.. మూడు సంవత్సరాలు దాటింది. కానీ ఇంకా దాని భయాలు మాత్రం తొలగిపోలేదు. అనేక రూపాల్లో ఇంకా దాడి చేస్తూనే ఉంది. సీజన్‌కి ఒక కొత్త వేరియంట్ పుట్టుకొస్తూనే ఉంది. ప్రస్తుతం చైనా సహా పలు దేశాల్లో.. కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో మరో పిడుగు లాంటి వార్త భయాందోళనకు గురిచేస్తోంది. అదే ఒమిక్రాన్ సబ్ వేరియంట్..
అమెరికాను ఈ వేరియంట్ వణికిస్తోంది. ఆ దేశంలో ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో 40శాతం కేసులకు ఈ వేరియంటే కారణం. న్యూయార్క్‌లోని ఆసుపత్రుల్లో చాలా మంది రోగులు ఈ వేరియంట్‌తో బాధపడుతున్నారు. వారంలోనే కేసులు రెట్టింపవడానికి కేవలం ఈ XBB.1.5 వేరియంటే కారణమని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. సింగపూర్ నుంచి అమెరికాలో వ్యాప్తి చెందిందీ వైరస్.
ఇప్పటి వరకు నమోదైన సబ్ వేరియంట్లతో పోల్చుకుంటే ఇది 120 రెట్లు వేగవంతంగా వ్యాపిస్తోందని సమాచారం. అందుకే దీనిని ‘సూపర్ వేరియంట్’ గా వైద్యులు పిలుస్తున్నారు. టీకాలు, బూస్టర్ డోసులు ఈ వేరియంట్ ముందు అంతగా ప్రభావం చూపడం లేదని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సబ్ వేరియంట్ అనేక రకాల ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తున్నట్టుగా నిపుణులు గుర్తిస్తున్నారు.
Omicron XBB వేరియంట్‌ను గుర్తించడం సులభం కాదు. ఈ వేరియంట్ సోకిన రోగులకు దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉండవు. డెల్టా వేరియంట్ కంటే ఇది 5 రెట్లు ప్రమాదకరం.. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ వేరియంట్‌ను 2022 ఆగస్ట్‌లో గుర్తించినట్టు WHO ప్రకటించింది. ఈ వైరస్‌పై పరిశోధనలు జరుగుతున్నాయనీ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
చైనా, అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. XBB.1.5 వేరియంట్‌ను భారత్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మొదటి కేసు వచ్చినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో కేంద్రం అలెర్టయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..