Cold Water Bath: చన్నీళ్లతో స్నానం చేస్తే గుండె జబ్బుల ప్రమాదం ఉందా? దీనిలో నిజమెంత..

కొంతమందికి ఏ సీజన్‌లోనైనా చన్నీటి స్నానం చేయటం అలవాటు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో చల్లని నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

Cold Water Bath: చన్నీళ్లతో స్నానం చేస్తే గుండె జబ్బుల ప్రమాదం ఉందా? దీనిలో నిజమెంత..
Cold Water Bath
Follow us

|

Updated on: Dec 31, 2022 | 6:47 PM

కొంతమందికి ఏ సీజన్‌లోనైనా చన్నీటి స్నానం చేయటం అలవాటు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో చల్లని నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చల్లని నీళ్లతో స్నానం చేస్తే రక్త ప్రసరణ క్రమంగా తగ్గుతుంది. ఆ తర్వాత శరీరం స్వయంగా వేడేక్కడానికి కొంత సమయం పడుతుంది. ఫలితంగా శరీరంలో రక్తప్రసరణ వేగం పుంజుకుని, రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి, హార్ట్‌బీట్‌లో తేడా వస్తుంది. అనతికాలంలోనే ఇటువంటి వారికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చల్లని ఉష్ణోగ్రతలు గుండె, రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చన్నీటి స్నానం చేయకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే వేడి వాతావరణంలో కూడా ఒక్కసారిగా చల్లని నీళ్లతో స్నానం చేస్తే హార్ట్‌ అటాక్‌ సంభవించే ప్రమాదం ఉంది. ఇటువంటి వారు షవర్ బాత్‌లు చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువ వేడి, అతి చల్లని నీళ్లతో కాకుండా.. వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ఉత్తమం. లేదంటే న్యూరోజెనిక్ కార్డియో రెస్పిరేటరీ ప్రతిస్పందనలకు దారితీసి ఆప్రభావంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.