Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg Benefits: జాజికాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే తీసుకోకుండా ఉండలేరు..

మానవ ఆరోగ్య సంరక్షణలో వంట గదిలో ఉండే అనేక రకాల మసాలా దినుసులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆ కారణంగానే మసాలా దినుసులు లేదా సుగంధ ద్రవ్యాలను వంటలోనే..

Nutmeg Benefits: జాజికాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే తీసుకోకుండా ఉండలేరు..
Nutmeg Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 31, 2022 | 6:52 PM

మానవ ఆరోగ్య సంరక్షణలో వంట గదిలో ఉండే అనేక రకాల మసాలా దినుసులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆ కారణంగానే మసాలా దినుసులు లేదా సుగంధ ద్రవ్యాలను వంటలోనే కాక ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తూ వచ్చారు మన పూర్వీకులు. లవంగం, యాలుక, ధనియాలు, జాజికాయ ఇలా ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు భారతీయ వంట గది.

అయితే ఈ మసాలా దినుసులలో జాజికాయకు ఉన్న ప్రత్యేకత వేరు. కాసింత జాజికాయను తురిమి చిటికెడు పొడిని వేస్తే అద్బుతమే. ఈ జాజికాయతో ఎన్నో రకాలుగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆయుర్వేద వైద్యంలో కూడా జాజికాయ ప్రాముఖ్యతను గొప్పగా వర్ణించారు మన పూర్వీకులు. ఇంత విశిష్టత కలిగిన జాజికాయతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

  1.  విపరీతమైన చెవి పోటుతో  బాధపడేవారు రెండు చుక్కల జాజికాయ రసాన్ని చెవిలో వేస్తే  చెవి పోటు తగ్గుతుంది. తలనొప్పిని తగ్గించడంలో కూడా జాజికాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
  2. పచ్చకామెర్ల జబ్బు చేసినపుడు జాజికాయను పథ్యంలో భాగం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.  ఈ జాజికాయ బలాన్ని చేకూర్చడమే కాకుండా నాలుక మీద పాచిని పోగొట్టి జిగురుగా ఉంచే లక్షణాన్ని తగ్గిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. విరేచనాలతో బాధపడుతున్నవారు జాజికాయను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.  దంత సంరక్షణలో కూడా జాజికాయ పనిచేస్తుంది. ఇంకా దంతాలు నలుపుగా మారకుండా కాపాడుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా దోహాదపడుతుంది.
  5. సాంప్రదయకరమైన తాంబూలంలో జాజికాయను తప్పకుండా వాడతారు. జాజికాయ లైంగిక సమర్థతను పెంచడంలో ఉపకరిస్తుంది.
  6. పిల్లల్లో విరేచనాల సమస్య ఎక్కువగా ఉన్నపుడు నెయ్యి, జాజికాయ, పంచదార మూడు కలిపి పిల్లలతో తినిపించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
  7. గుండె బరువు, గుండెలో నొప్పిగా ఉన్నపుడు జాజికాయను పాలలో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. జాజికాయను వాడటం వల్ల శరీరానికి మంచి రంగు కూడా వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..