Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Milk Benefits: పచ్చిపాలతో చర్మానికి ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

చాలా మందికి వారి ఆహారపు అలవాట్లలో పాలు కూడా భాగంగా ఉంటుంది. పాటు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. పాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్..

Raw Milk Benefits: పచ్చిపాలతో చర్మానికి ఇన్ని  ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Milk (File Photo)
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 31, 2022 | 5:14 PM

చాలా మందికి వారి ఆహారపు అలవాట్లలో పాలు కూడా భాగంగా ఉంటుంది. పాటు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. పాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవిగా ఉంటాయి. ఇక చాలా మంది పాలను వేడి చేసి మాత్రమే తాగుతుంటారు. అందుకు పచ్చిపాలలో అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని భావించడమే కారణం.

అయితే పచ్చిపాలు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజకరమైనవే. ఇంకా పచ్చిపాలతో ఏ విధమైన దుష్ప్రయోజనాలు లేవు. పచ్చిపాలు మన చర్మ సంరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. మరి పచ్చిపాలతో మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మృదువైన చర్మం: పచ్చిపాలలో అనేక రకాల పోషకాలున్నాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, సోడియం, కాల్షియం మన ఆరోగ్యానికి చాలా లాభదాయకం. అన్నింటికంటే పచ్చిపాలు చర్మానికి ఓ వరం లాంటిదని చెప్పకొవచ్చు. పచ్చిపాల మీగడను ముఖానికి రాసుకుంటే ఏ విధమైన మచ్చల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాక పచ్చిపాల కారణంగా చర్మంపై ఉండే డెడ్ సెల్స్ తొలగిపోయి అది మెరిసిపోతుంది. చర్మం డ్రైగా ఉంటే రోజూ మాయిశ్చరైజర్ రాసినట్టే పచ్చిపాలు లేదా పాల మీగడను కూడా రాసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మెరిసే కళ్లు: కళ్లు అనేవి కేవలం చూసేందుకే కాదు.. వ్యక్తిత్వ గుర్తింపుకు కూడా చాలా అవసరం. మీ కళ్లు బలహీనంగా ఉన్నా లేదా కంటి చుట్టూ నల్లటి మచ్చలున్నా పచ్చిపాలను రోజూ రాయాలి. అలా చేయడం ద్వారా కొన్ని రోజుల్లోనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

అందమైన పెదవులు: చాలాసార్లు మన పెదవులు నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అంతేకాక నల్లగా మారిపోతాయి. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పచ్చిపాల మీగడను పెదవుల మీద రాసుకోవాలి. లిప్‌బామ్ కంటే పచ్చి పాల మీగడ రాయడం చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా అనతి కాలంలోనే దాని ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..