Covid 19 XXB 1.5: గుజరాత్‌లో మరో ‘సూపర్ వేరియంట్’.. మిగిలిన వాటి కంటే 120 రెట్ల వేగంగా వ్యాప్తి.. వివరాలివే..

ఇప్పటి వరకు నమోదైన సబ్ వేరియంట్లతో పోల్చుకుంటే ఇది 120 రెట్లు వేగవంతంగా వ్యాపిస్తోందని సమాచారం. మరోవైపు గత వారం కాలంలో అమెరికాలో నమోదైన కరోనా కేసులలో 40.5 శాతం XBB.1.5 కేసులే

Covid 19 XXB 1.5: గుజరాత్‌లో మరో ‘సూపర్ వేరియంట్’.. మిగిలిన వాటి కంటే 120 రెట్ల వేగంగా వ్యాప్తి.. వివరాలివే..
Covid19 New Sub Variant Xbb
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 31, 2022 | 4:15 PM

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ BB7 కేసులు గణనీయంగా పెరుగుతుండగానే మరో సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఉద్భవించిన సబ్ వేరియంట్ XBB1.5 విదేశాలలో ఆందోళనలను కలిగిస్తోంది. కరోనా లెక్కల ప్రకారం ప్రస్తుతం కరోనా XBB1.5 కేసులు సింగపూర్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగపూర్‌తో పాటు దానికి చుట్టుపక్కల ఉన్న ఆసియా దేశాలలో కూడా ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయినట్లు ఆయా దేశాల వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిన్న(డిసెండర్ 31) గుజరాత్‌లో కూడా కరోనా  XBB1.5 కేసు నమోదు కావడంతో భారత్‌లో కూడా ఇది ప్రవేశించినట్లయింది. దీనికి సంబంధించిన 10-15 శాతం నమునాలు గుజరాత్‌లో కనిసిస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకు నమోదైన సబ్ వేరియంట్లతో పోల్చుకుంటే ఇది 120 రెట్లు వేగవంతంగా వ్యాపిస్తోందని సమాచారం. మరోవైపు గత వారం కాలంలో అమెరికాలో నమోదైన కరోనా కేసులలో 40.5 శాతం XBB.1.5 కేసులే అని ఆరోగ్య నిపుణులు అంచనా. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం కరోనా సబ్‌ వేరియంట్ XBB.1.5 గత వారంతో పోలిస్తే ఈ వారం రెట్టింపు అయ్యింది. అందువల్ల దీనిని ‘సూపర్ వేరియంట్’ అని కూడా వారు పిలుస్తున్నారు. ఈ వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందుతుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ XBB:

ఒమిక్రాన్ అనేది కరోనాకు వేరియంట్ అని అందరికీ తెలిసిందే. ఒమిక్రాన్ BA.2.75, BJ.1 సబ్ వేరియంట్ల కలయిక కారణంగా XBB 1.5 ఏర్పడింది. ఇక దీనిని ముందుగా సింగపూర్‌లో గుర్తించారు. ఆ దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడానికి ఈ సబ్ వేరియంట్ ప్రధాన కారణమయింది. దీని వ్యాప్తి వేగం మిగిలిన సబ్ వేరియంట్ల కంటే 120 రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కేసుల పెరుగుదలకు కారణమవుతున్న ఇతర ఉప వేరియంట్లు భారతదేశంలో కూడా ఉండడానికి అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. భారత్‌లోనూ అనేక నమూనాలలో కొత్త వేరియంట్ల జాడలు కనిపించాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఒమిక్రాన్‌ XBB 1.5 కేసులు  ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్నాయి. ఈ వేరియెంట్‌ మన దేశంలో విజృంభిస్తే.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ గణనీయంగా పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర ఉప-వేరియంట్‌లపై ఆధిపత్యం అంటే వాటి కంటే వేగంగా వ్యాపించి మానవాళిని ప్రభావితం చేయగల లక్షణాలను XBB 1.5 ప్రదర్శిస్తోందని పలువురు గుర్తించారు. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను ఏమార్చే లక్షణాలను కలిగిన సబ్ వేరియంట్ అని చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమైనట్టు ఎలాంటి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ వేరియంట్ సోకిన వారు వ్యాక్సిన్లు తీసుకోకపోతే ప్రమాదంలో పడతారని, వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి..

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్
ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్
బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?
బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?
అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు
అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు
పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు లూటీ..
తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు లూటీ..
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..