Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facial Beauty Tips: మీ ముఖ సౌందర్యాన్ని రక్షించుకోవాలనుకుంటే.. ఈ తప్పులను చేయనే చేయకండి.. అవేమిటంటే..

మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల చర్మ సౌందర్య పాడవుతుంది. మెరిసిపోవాల్సిన చర్మం కళ తప్పి కనిపించడానిక మనం చేసే తప్పులే ప్రధాన కారణం. ఇలా చేయడం వల్లనే చిన్న వయస్సులోనే..

Facial Beauty Tips: మీ ముఖ సౌందర్యాన్ని రక్షించుకోవాలనుకుంటే.. ఈ తప్పులను చేయనే చేయకండి.. అవేమిటంటే..
Beauty Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 31, 2022 | 6:25 PM

ప్రస్తుత కాలంలో అందం అనేది కేవలం ముఖ చర్మానికి  సంబంధించినదే కాక వ్యక్తి వ్యక్తిత్వానికి చెందినదిగా మారింది. అలాంటి పరిస్థితుల కారణంగానే సాధ్యమైనంతవరకూ అవసరమైతే లక్షల రూపాయలు వెచ్చించి మరి అందంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది. అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే వారి చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు. మాయిశ్చరైజర్లు, లోషన్లు  ముఖానికి, చర్మానికి అప్లై చేస్తుంటారు.

అయితే మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల చర్మ సౌందర్య పాడవుతుంది. మెరిసిపోవాల్సిన చర్మం కళ తప్పి కనిపించడానిక మనం చేసే తప్పులే ప్రధాన కారణం. ఇలా చేయడం వల్లనే చిన్న వయస్సులోనే చర్మ ముడతలు బాధిస్తాయి. చర్మ ఆరోగ్యం కోసం జీవనశైలిలో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మరి చర్మ సంరక్షణ కోసం, ముఖం అందంగా కనిపించేందుకు ఎలాంటి తప్పులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖాన్ని పదేపదే కడగడం:

చాలా మంది ముఖ చర్మం జిడ్డుగా ఉందని పదే పదే కడుగుతుంటారు. నిజానికి చర్మం నుంచి విడుదలయ్యే స్రావాలు మన ముఖానికి మేలే చేస్తాయి. తరచూగా ముఖాన్ని కడగడం వల్ల ఆ స్రావాలు తొలగిపోతాయి. ఫలితంగా వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అందువల్లనే పదేపదే ముఖాన్ని కడగడం మానుకోవాలని చర్మ సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు మూడుసార్ల కంటే ఎక్కువగా కడగకూడదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ మేకప్ వేయడం:

చాలా రకాల కాస్మొటిక్స్ మన చర్మానికి సరిపడవు. ముఖ్యంగా మేకప్ ఉత్పత్తులు చర్మానికి చికాకు లేదా మొటిమలు పెరగడానికి దారితీస్తాయి. వివిధ రంగుల ఐషాడోలు, కాజల్‌లను ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల రోజువారీ మేకప్ వేసుకోవడం మంచిది కాదని డెర్మటాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

తరచూ చర్మాన్ని తాకడం:

మనకు తెలియకుండానే మన ముఖాన్ని తరచుగా తాకుతుంటాం. ఇలా చేయడం వల్ల మన చేతుల్లో ఉండే సూక్ష్మక్రిములు చర్మంపై దద్దుర్లు, దురదను కలిగిస్తాయి. అందుకే చర్మాన్ని తాకే ముందుకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం లేని చేతులతో ముఖాన్ని తాకవద్దని డెర్మటాలజీ చెబుతున్నారు.

సరిపడా నీళ్లు తాగకపోవడం:

నీరు శరీరాన్ని హైడ్రేటెడ్, రిఫ్రెష్‌గా ఉంచుతుందని మనందరికీ తెలుసు. తద్వారా చర్మం కూడా ఆరోగ్యంగా ఉండడమే కాక మెరుస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీయవచ్చు. తద్వారా చర్మం పొడిబారుతుంది.

పోషకాహారం తీసుకోకపోవడం:

ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్‌లో మొటిమలు, రోసేసియా, అలెర్జీలకు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. వీటికి బదులుగా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే తాజా పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా కాకుండా పోషకాలు లేని పదార్థాలను తినడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని చర్మ సంబంధిత నిపుణుల అంటున్నారు.

నిద్ర లేకపోవడం:

శరీరానికి సరిపడినంతగా నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ క్రమంలోనే చర్మాన్ని ఆరోగ్యంగా, ముడతలు పడకుండా ఉంచే కొల్లాజెన్ వంటి ప్రొటీన్ల ఉత్పత్తి మందగిస్తుంది. మంచి చర్మం కోసం రోజూ కంటినిండ నిద్ర ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..