Giloy Health Benefits: తిప్ప తీగ ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగించే మూలికలు, తీగలు, ఆకులు, పదార్థాలన్నీ దాదాపుగా మన పరిసర ప్రాంతాలలో లభించేవే కావడం దీనికి ఉన్న మరో విశిష్టత. అలాంటి తీగలలో తిప్పతీగ..

Giloy Health Benefits: తిప్ప తీగ ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Health Benefits With Giloy
Follow us

|

Updated on: Dec 31, 2022 | 7:26 PM

ప్రస్తుత కాలంలో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన కారణంగా భారతీయ ఆయుర్వేదం ప్రాముఖ్యత తగ్గింది. కానీ ఎన్నో వేల సంవత్సరాల నాటినుంచి మన దేశంలో ఆయుర్వేదంలోనే చికిత్సలు చేసేవారు. ఆయుర్వేద వైద్యంలోనే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందారు మన పూర్వీకులు. ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగించే మూలికలు, తీగలు, ఆకులు, పదార్థాలన్నీ దాదాపుగా మన పరిసర ప్రాంతాలలో లభించేవే కావడం దీనికి ఉన్న మరో విశిష్టత. అలాంటి తీగలలో తిప్పతీగ కూడా ఒకటి. మరి దీని గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని వల్ల మనకు ఎన్ని రకాల ప్రయోజనాలో తెలిస్తే ఆశ్యర్యపోకుండా ఉండలేరు.

అనేక రకాల ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగించే తిప్పతీగనను సంస్కృతంలో అమృత అని కూడా పిలుస్తారు. నిజంగా ఈ మొక్క మ‌న‌కు అమృతంలాగే ప‌నిచేస్తుంది. దీంతో అనేక అరోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తిప్పతీగ‌లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉండడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మరి తిప్పతీగతో మనకు కలిగే ప్రయోజ‌నాల‌ేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగ నిరోధ‌క శ‌క్తి:

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని గ‌ణ‌నీయంగా పెంచడంలో తిప్పతీగ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆల్క‌లాయిడ్లు, లాక్టేన్లు అనే బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉండడం వల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్ట పరచడంలో తిప్పతీగ దోహదపడుతుంది . అంతేకాక శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించి, ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి:

వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ జీవిత బాధ్యతల కారణంగా చాలా మంది ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారికి తిప్ప‌తీగ దివ్య ఔష‌ధంగా పనిచేస్తుంది. శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డ‌ంలోనే కాక మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మార్చడంలోనూ తిప్పతీగ ఉపకరిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి.. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది.

ఆర్థ‌రైటిస్:

తిప్ప‌తీగ‌లో యాంటీ ఆర్థ‌రైటిస్ గుణాలు ఉండడం వ‌ల్ల కీళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కీళ్లు వాపుల‌కు గుర‌వ‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే తిప్ప తీగ కీళ్ల వాపుల‌ను త‌గ్గిస్తుంది. ఈ క్ర‌మంలో ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

డ‌యాబెటిస్:

తిప్ప‌తీగ మ‌న శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తి స్థాయి పెరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. తిప్ప‌తీగ‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

శ్వాస స‌మ‌స్య‌లు:

తిప్ప‌తీగ‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉండడం వల్ల జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. తిప్ప‌తీగ‌లో ఉండే ఔష‌ధ గుణాలు శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం తిప్ప‌తీగ ఈ స‌మ‌స్య‌ల‌ పరిష్కారంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరిగి ఈ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

జీర్ణ ప్ర‌క్రియ:

ప్రస్తుత కాలంలో అవలంభిస్తున్న జీవ‌న విధానం, ఆహారపు అలవాట్ల వ‌ల్ల చాలా మందికి జీర్ణ స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. అలాంటి వారు తిప్ప‌తీగ‌ను నిత్యం తీసుకోవాలి. తిప్ప‌తీగ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

తీవ్ర‌మైన జ్వ‌రం:

ఫ్లూ, ఇత‌ర వైర‌ల్ జ్వ‌రాలు వ‌చ్చినప్పుడు తిప్ప‌తీగ‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. తిప్ప‌తీగ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఫలితంగా జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..