AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belly Fat Tips: బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ కూరగాయలను తినడం అసలు మర్చిపోకండి..

ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడేవారు కార్భోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. అంతేకాదు నూనెలో వేయించిన, ఫ్రూడ్ ఫుడ్స్‌కు దూరంగా..

Belly Fat Tips: బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ కూరగాయలను తినడం అసలు మర్చిపోకండి..
Vegetables For Belly Fat
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 31, 2022 | 8:08 PM

Share

ప్రస్తుత కాలంలో పాటిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్, ఊభకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు చాలా చిన్న వయసు నుంచే వెంటాడుతున్నాయి. ఇక బెల్లీ ఫ్యాట్ అనేది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి పరిష్కార మార్గంగా లక్షల రూపాయలతో వైబ్రేటింగ్ మిషన్స్ కొనుగోలు చేసేవారు కూడా లేకపోలేదు. బెల్లి ఫ్యాట్ కారణంగా మనలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమేమో కానీ దీనిలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లి ఫ్యాట్‌ను కరిగించేందుకు ఎటువంటి ఖర్చు చేసే అవసరం లేకుండా కొన్ని రకాల ఆహార మార్పులు చేపడితే చాలంటున్నారు వారు.

వారి సూచనల ప్రకారం ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడేవారు కార్భోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. అంతేకాదు నూనెలో వేయించిన, ఫ్రూడ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవాలంటే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం అంత సులువు కాదు. కానీ కొన్ని రకాల కూరగాయలను తినడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. బీట్ రూట్: బీట్రూట్‌లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండడమే కాక కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునే వారు బీట్రూట్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఇది బెల్లీ ఫ్యాట్‌ కోసమే కాక బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
  2. క్యారెట్లు: క్యారెట్లు కూడా బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించడానికి సహాయపడతాయి. క్యారెట్లలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండే క్యారెట్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి, బరువును నియంత్రించడానికి క్యారెట్లను తినడం మంచిది.
  3. ఇవి కూడా చదవండి
  4. క్యాలీఫ్లవర్: క్యాలీఫ్లవర్‌ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే క్యాలీఫ్లవర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. మీ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా క్యాలీఫ్లవర్ ఉపయోగపడుతుంది.
  5. కీరదోసకాయ: కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉండే కీరదోసలో నీటితో పాటుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర ఆకలి కోరికలను కూడా నియంత్రిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. అందుకే బెల్లీ ప్యాట్‌ను తగ్గించుకోవాలనుకునే వారు కీరదోసకాయ జ్యూస్‌ను తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  6. బ్రోకలీ: 100 గ్రాముల బ్రోకలీలో 34 క్యాలరీలు ఉంటాయి. బ్రోకలీలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బెల్లీ ఫ్యాట్‌ను, అధిక బరువును తగ్గించడంలో బ్రోకలీ ఉపకరిస్తుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..