Cholesterol: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతున్నారా..? వీటిని రెగ్యులర్‌గా తింటే ఆ సమస్యే ఉండదు..

కొలెస్ట్రాల్.. అన్ని రోగాలకు ముఖ్య కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే భయంకరమైన వ్యాధులు చుట్టుముడుతాయని పేర్కొంటున్నారు.

Cholesterol: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతున్నారా..? వీటిని రెగ్యులర్‌గా తింటే ఆ సమస్యే ఉండదు..
Cholesterol
Follow us

|

Updated on: Dec 31, 2022 | 8:37 PM

కొలెస్ట్రాల్.. అన్ని రోగాలకు ముఖ్య కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే భయంకరమైన వ్యాధులు చుట్టుముడుతాయని పేర్కొంటున్నారు. మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్ లు శరీరంలో ఉంటాయి. వైద్య భాషలో హెచ్‌డిఎల్‌ని మంచి కొలెస్ట్రాల్ అని, ఎల్‌డిఎల్‌ని చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. చెడు కొ కొలెస్ట్రాల్ పెరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం అనేది చాలామందికి ఆందోళన కలిగిస్తుంది. అయితే, అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి అనే సందేహం కలిగితే.. రక్తంలో కనిపించే జిడ్డు (కొవ్వు) పదార్థమే కొలెస్ట్రాల్ అని పేర్కొంటున్నారు. ఇది చెడు ఆహార పదార్థాలు తినడం వల్ల సంభవిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగితే.. మన రక్త ప్రవాహంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

వీటిని తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు

  1. అవకాడోలో ఉండే ఒలిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే శరీరంలో దాని సమతుల్యతను సరిచేస్తుంది. అందుకే వంటకు కూడా అవకాడో నూనెను ఉపయోగించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
  2. బ్లాక్, గ్రీన్ టీలలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే నిపుణులు గ్రీన్ టీ మంచిదని పేర్కొంటున్నారు. గ్రీన్ టీలో పొరపాటున కూడా పాలు, పంచదార కలపకూడదు.
  3. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు బాదం, పిస్తాలో కనిపిస్తాయి. ఇది రక్తంలో LDL స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే రోజూ 5 నుంచి 7 బాదంపప్పులు తినండి. దీని వల్ల మీ శరీరం చాలా ప్రయోజనాలను పొందుతుంది.
  4. మొలకెత్తిన గింజల్లో ఉండే పీచుపదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మొలకలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నయం చేస్తుంది. ఫైబర్స్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పని చేస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. బీన్స్, కాయధాన్యాలు, శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పని చేస్తాయి. ఆహారంలో వీటిని రెగ్యులర్ గా చేర్చుకోవడం మంచిది.
  7. పైనాపిల్, నిమ్మ, నారింజ, ఆపిల్, బేరి కూడా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడానికి పని చేస్తాయి.
  8. సలాడ్లు, ఆవిరి మీద ఉడికించిన ఆహారం కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..