AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరుగుదొడ్లు శుభ్రం చేసే మహిళ డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక! చరిత్ర సృష్టించిన పారిశద్ధ్య కార్మికురాలు..

40 ఏళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసిన ఓ మహిళ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. తాజాగా బీహార్‌లోని గయా ప్రాంతంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చింతాదేవి అనే..

మరుగుదొడ్లు శుభ్రం చేసే మహిళ డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక! చరిత్ర సృష్టించిన పారిశద్ధ్య కార్మికురాలు..
Gaya Deputy Mayor
Srilakshmi C
|

Updated on: Dec 31, 2022 | 8:33 PM

Share

40 ఏళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసిన ఓ మహిళ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. తాజాగా బీహార్‌లోని గయా ప్రాంతంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చింతాదేవి అనే పారిశుధ్య కార్మికురాలు పోటీచేసి డిప్యూటీ మేయర్‌గా ఘన విజయం సాధించారు. రాజకీయాల్లో అద్భుతాలు చేయడం చింతాదేవి ఇదేం తొలిసారి కాదు. ముసహర్ కమ్యూనిటీకి చెందిన భగవతీ దేవి1996లో నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ నుండి పోటీ చేసి గయా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గాయా మేయర్‌గా ఎన్నికైన గణేష్ పాశ్వాన్ మాట్లాడుతూ..

‘గయా అనేది ప్రజలు జ్ఞానోదయం కోరుకునే ప్రదేశం. ముసహర్ మహిళ లోక్‌సభకు వెళ్లే ప్రదేశం కూడా ఇదే. మరుగుదొడ్లు తక్కువగా ఉన్న సమయంలో మానవ వ్యర్ధాలను శుభ్రం చేసేవారు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నోకవడం ద్వారా ఇక్కడి ప్రజలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని’ ఆయన అన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ కూడా ఎమ్మెల్యే దేవికి మద్దతు పలికారు. చింతాదేవి ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారని ఆయన అన్నారు. గయా ప్రజలు అణగారిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని శ్రీవాస్తవ అన్నారు. కాగా చింతాదేవి పారిశుధ్య కార్మికురాలిగా మాత్రమేకాకుండా రోడ్లు ఊడ్వడం, డ్రైనేజీలు, మ్యాన్ హోళ్లు శుభ్రం, కూరగాయలు అమ్మడం వంటి పనులు కూడా చేసి జీవనం సాతించేవారు.

ఇవి కూడా చదవండి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.