Amit Shah: అవన్నీ అసత్య ప్రచారాలే.. కర్ణాటకలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Dec 31, 2022 | 9:17 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించాయి. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Amit Shah: అవన్నీ అసత్య ప్రచారాలే.. కర్ణాటకలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
Amit Shah

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించాయి. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండబోదని.. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడింట.. రెండొంతుల మెజారిటీ సాధించేలా పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. బెంగళూరులో బీజేపీ బూత్ ప్రెసిడెంట్లు, బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్-సెక్యులర్‌ (జేడీఎస్) తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తలను ఖండించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టంచేశారు. జేడీఎస్‌కు ఓటేసినా.. అది కాంగ్రెస్‌ వేసినట్లేనంటూ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని దేశభక్తులకు ఓటేస్తారా..? దేశాన్ని విభజించే కాంగ్రెస్‌ నేతృత్వంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌కు ఓటేస్తారా..? ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో తేల్చుకోవాలంటూ ప్రజలకు అమిత్ షా సూచించారు.

ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉంటుందన్న ప్రచారంపై తప్పుదోవ పట్టవద్దని కర్ణాటక ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంంలో ద్విముఖ పోటీ మాత్రమే ఉంటుందని.. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని.. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ సూచించారు. బీజేపీ అందరి సంక్షేమం, సాధికారతను దృష్టిలో ఉంచుకుని పాలనను కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బొమ్మై బసవరాజు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అమిత్ షా కొనియాడారు.

ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో, యడియూరప్ప, బసవరాజు బొమ్మై కర్ణాటకకు సుపరిపాలన అందించారన్నారు. గుజరాత్ లాగా 2/3 వంతు మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చూడాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

గతంలో ఉన్న కాంగ్రెస్, జెడిఎస్‌ ప్రభుత్వం నిషేధిత సంస్థ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సభ్యులపై కేసులను ఉపసంహరించుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన పీఎఫ్‌ఐపై మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu