Sleeping Direction: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే శుభకరం.. ఆర్థికంగా శ్రేయస్కరం.. మనశ్శాంతి..!

ఆరోగ్యానికి, ఆయుష్షుకి చాలా మంచిదని చెబుతారు. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ పడమటి నుంచి తూర్పువైపు పయనిస్తుంటాయి. అందుకే..

Sleeping Direction: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే శుభకరం.. ఆర్థికంగా శ్రేయస్కరం.. మనశ్శాంతి..!
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2023 | 1:50 PM

వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు మన తలని తప్పుడు దిశలో ఉంచితే, ఒత్తిడి, మరణం, కెరీర్ లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నిద్రపోయే దిశను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రించే సమయంలో తలపెట్టి పెట్టాల్సిన దిశ మారితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మనం పడుకునే గదిని చల్లగా, వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు పడకగది వాస్తుతో పాటు నిద్రించే దిశను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

వాస్తు ప్రకారం నిద్రించేందుకు ఉత్తమ దిశ..

ఉత్తరం.. ఉత్తరంలో తల ఉంటే మృత్యు యోగం అంటున్నారు జ్యోతిష్యులు. తలని ఏ దిక్కున ఉంచినా సరే, ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. ఇది అనవసరమైన సమస్యలకు దారి తీస్తుంది. ఈ దిక్కుకి అధిపతి కుబేరుడు కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టి నిద్రపోవద్దు. ఎందుకంటే కేవలం శవాన్ని మాత్రమే ఉత్తరం వైపునకు పెడతారు. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ యముడిస్థానం కావడంతో చావుకి ఎదురెళ్లినట్టే అంటారు వాస్తు నిపుణులు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉండటమే కాదు మనస్సు కూడా నియంత్రణలో ఉండదంటారు.

తూర్పు దిక్కు.. తూర్పు దిక్కు ఇంద్ర స్థానం, కుబేర స్థానం. అందుకే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిదని చెబుతారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. అందుకే దేవతలుండేవైపు తలబెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు. ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట.

ఇవి కూడా చదవండి

పడమర… పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్లు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది. కాబట్టి ఈ దిశగా కాళ్లు పెట్టడం దోషం అంటారు.

దక్షిణం.. ఇది యమ స్థానం. దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటు వైపు కాళ్ళు కాకుండా తలపెట్టుకోవాలని చెబుతారు. ఆరోగ్యానికి, ఆయుష్షుకి చాలా మంచిదని చెబుతారు. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ పడమటి నుంచి తూర్పువైపు పయనిస్తుంటాయి. అందుకే తూర్పు, దక్షిణం వైపు శిరస్సుంచి పడుకోవడం మంచిదంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.