Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం ఎందుకు? ద్వాదశి విశిష్టత ఏమిటో తెలుసా..

ఈ రోజు మహా విష్ణువు యెాగ నిద్ర నుండి మేల్కొని భూలోకానికి సమస్త దేవతలతో వచ్చినట్లు ఒక కథం. ఈ రోజే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇచ్చాడని.. మహభారత యుద్ధ సమయంలో భగవద్గీతను అర్జునునకు ఉపదేశించిన రోజు అని విశ్వాసం. 

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం ఎందుకు? ద్వాదశి విశిష్టత ఏమిటో తెలుసా..
Vaikunta Ekadasi 2023
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 5:56 PM

చంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో పదకొండవ తిథి ఏకాదశి. ఏకాదశి అంటే పౌర్ణమి తరవాత వచ్చే 11వ రోజు.. అదే విధంగా  అమావాస్య తరవాత వచ్చే 11వ రోజు. అధి దేవత .. శివుడు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుధ్ద ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకి సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తారు. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడు అని చెబుతారు. అంతేకాదు ఈ రోజు మహా విష్ణువు యెాగ నిద్ర నుండి మేల్కొని భూలోకానికి సమస్త దేవతలతో వచ్చినట్లు ఒక కథం. ఈ రోజే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇచ్చాడని.. మహభారత యుద్ధ సమయంలో భగవద్గీతను అర్జునునకు ఉపదేశించిన రోజు అని విశ్వాసం.

ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారంటే

వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటంటే..

ఇవి కూడా చదవండి

పౌరాణిక గాథ

పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న ఓ పురాణ కథనం. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కనుక ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు వచ్చిందని అంటారు.

ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఈ సమయంలో ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో, వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో.. ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందంటారు. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట.

పురాణ కథ వెనుక తత్వం: 

మనకి పై దిశగా ఉండే దిక్కు ఉత్తరం. ఈ ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని యమస్థానం అంటారు. మన శరీరంలో జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తరభాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి, సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు.

అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి.. శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా.. తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని ప్రార్ధించాలి.  ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు.. తమ మనసులోనే ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకుని తమలోని  అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి.

హైందవ సంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించినా, ఉత్తర ద్వార దర్శనంగుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా.. తమ మేథస్సు వికసించాలని కోరుకోవాలి,

ఇక ఏకాదశి మర్నాడు.. ద్వాదశి.. చంద్రమానం ప్రకారం పక్షంలో రోజులలో పన్నెండవ తిథి ద్వాదశి. చాంద్రమానంలో శుక్లపక్షంలో వచ్చు ద్వాదశిని శుద్ధ ద్వాదశి అనీ, కృష్ణపక్షంలో వచ్చు ద్వాదశిని బహుళ ద్వాదశి అని పిలుస్తారు. ద్వాదశికి అధి దేవత విష్ణువు. ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారు.. ద్వాదశి రోజున ఆ ఉపవాసాన్ని విడుస్తారు. తమ స్థాయికి తగినట్లు.. అన్నదానం వంటి కార్యక్రమాలు జరిపిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)