AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaikunta Ekadasi: కాకతీయుల నాటి శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయానికి పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల పాటు ఉత్సవాలు

చౌటుప్పల్‌ దేవలమ్మ నాగారం గ్రామంలో పూజలందుకుంటున్న ఈ ఆదిమహావిష్ణువుకు ఓ ప్రత్యేకత ఉంది. 2015 వ సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పని నిమిత్తం తవ్వుతుండగా తవ్వకాల్లో ఈ విష్ణుమూర్తి విగ్రహం లభించింది.

Vaikunta Ekadasi: కాకతీయుల నాటి శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయానికి పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల పాటు ఉత్సవాలు
Telangana Mukkoti Ekadashi
Surya Kala
|

Updated on: Jan 02, 2023 | 6:10 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఉత్తరద్వార దర్శనానికి పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆదిమహావిష్ణువు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక ఈరోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు . ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమామైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

కాగా చౌటుప్పల్‌ దేవలమ్మ నాగారం గ్రామంలో పూజలందుకుంటున్న ఈ ఆదిమహావిష్ణువుకు ఓ ప్రత్యేకత ఉంది. 2015 వ సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పని నిమిత్తం తవ్వుతుండగా తవ్వకాల్లో ఈ విష్ణుమూర్తి విగ్రహం లభించింది. ఈ విగ్రహం కాకతీయుల కాలంనాటి విగ్రహంగా పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. కాగా ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు ఆలయ కమిటీ. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు.

REPORTER: REVANREDDY

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..