మేష రాశి
ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించడానికి, అవి అధికారుల దృష్టిలో పడటానికి కాస్తంత ఎక్కువగానే తాపత్రయపడుతుంటారు. విధి నిర్వహణలో వారు పూర్తిగా మనసుపెట్టి, శ్రద్ధ తీసుకొని, లక్ష్యాలను పూర్తి చేస్తుంటారు. ఈ ఏడాది శని ఈ రాశి వారికి లాభ స్థానంలో అంటే కుంభ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల, గురువు మేషరాశిలో ప్రవేశిస్తున్నందువల్ల, అతి త్వరలో వీరి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ నెల 18 తర్వాత తప్పకుండా అధికారం చేపట్టే సూచనలు ఉన్నాయి. పైగా, ఒక పెద్ద లేదా ప్రతిష్టాత్మక కంపెనీలో వీరు అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది.