Chanakya Niti: ఈ విషయానికి భార్యాభర్తలు దూరంగా ఉండాల్సిందే.. లేదంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్న చాణక్య

ఏ రిలేషన్ షిప్ లోనైనా ఒక్క విషయంలో తేడా వస్తే.. ఎంతటి సంతోషకరమైన సంబంధమైనా చీలికలు ఏర్పడతాయని.. చాణక్యుడు చెప్పాడు. తగిన సమయంలో ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే.. ఆ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం పై తీవ్ర ప్రభావం పడుతుంది.

Chanakya Niti: ఈ విషయానికి భార్యాభర్తలు దూరంగా ఉండాల్సిందే.. లేదంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 8:35 PM

వైవాహిక జీవితం లేదా ప్రేమ, స్నేహం ఇలా ఏదైనా సంబంధానికి అయినా నమ్మకమే పునాది. భార్యాభర్తలు, ప్రేమ , అన్నదమ్ముల బంధం ..  సంబంధాల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే ఏ బంధాల మధ్య సమన్వయం లోపిస్తుందో.. ఆ సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలోనూ, వైవాహిక జీవితంలోనూ ఆనందాన్ని పొందాలంటే మానసిక ప్రశాంతత, పరస్పర గౌరవం ఉండాలి. ఆచార్యచాణక్యుడు తన విధానంలో చెప్పినట్లు, ప్రేమ జీవితంలోనైనా  వైవాహిక జీవితంలోనైనా ఒక విషయం గ్రహణంగా మారుతుంది. ఏ రిలేషన్ షిప్ లోనైనా ఒక్క విషయంలో తేడా వస్తే.. ఎంతటి సంతోషకరమైన సంబంధమైనా చీలికలు ఏర్పడతాయని.. చాణక్యుడు చెప్పాడు. తగిన సమయంలో ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే.. ఆ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకొక్కసారి ఆ బంధం చెడిపోతుంది. అదే అహం.. ఏ వ్యక్తులైన సరే ఈగోకి పొతే ఆ  సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకొక్కసారి ఆ బంధం బలహీన పడి విడిపోయే అవకాశం కూడా ఉంది.

  1. చాణక్యుడి విధానం ప్రకారం.. వైవాహిక జీవితంలో భార్యాభర్తల్లో ఎవరికైనా అహంకారం ఏర్పడినప్పుడు.. వారిద్దరి మధ్య ఉన్న గౌరవం అక్కడితో ముగుస్తుంది. కొన్ని సంబంధాలలో అనవసరమైన విభేదాలకు అహం మూలకారణమని చాణక్యుడు చెప్పాడు.
  2. చాణక్య నీతి ప్రకారం.. అహంకారంతో మత్తులో ఉన్న వ్యక్తి .. వైవాహిక జీవితం ఉద్రిక్తత , దుఃఖంతో గడిచిపోతుంది. అందుకే నేను గొప్ప అధికం అనే ఫీలింగ్ రాకుండా చూసుకోండి
  3. అహం అనేది వైవాహిక జీవితంలో ఒక ముల్లు లాంటిది. ముల్లుని తాకడం వల్ల బెలూన్ ఎలా పగిలిపోయి నాశనం అవుతుందో.. అదే విధంగా అహం కలిగిన వ్యక్తి జీవితంలో సంతోషం, ప్రేమ కనుమరుగైపోయాయి. మళ్ళీ ఇవి చిగురించవు.
  4. అహంభావం ఉన్న వ్యక్తి ఎప్పుడూ మంచి ప్రేమికుడు కాలేడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ప్రేమ సంబంధాలలో అహం వచ్చినప్పుడు.. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ తగ్గుతుంది .. దూరం పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అహాన్ని విడనాడి వైవాహిక జీవితంలోకి ప్రవేశించాలి. ప్రేమించిన వ్యక్తి అహంకార భావాన్ని కలిగి ఉంటే.. వివాహం తర్వాత రాజీపడటంలో ఇబ్బంది పడతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)