Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: కాలంతో పోటీపడి పరుగులు పెడుతున్నా ఓడిపోతున్నారా.. విజయానికి ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి..

ఓటమి.. లేదా విజయం ఏదోకటి దక్కుతూనే ఉంటుంది. మీరు కూడా ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తుంటే.. తాము చేసే ప్రయత్నంలో ఓటమి ఉండదని నమ్మకంతో ముందుకు సాగండి. ఇలాంటి నమ్మకంతో ప్రయత్నించి ముందుకు సాగేవారు కన్న కలలు ఏదో ఒక రోజు నిజమవుతాయి

Success Mantra: కాలంతో పోటీపడి పరుగులు పెడుతున్నా ఓడిపోతున్నారా.. విజయానికి ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి..
Success Mantra
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 9:00 PM

నేటి మనిషి కాలంతో పోటీపడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా ఆపకుండా, ఆగకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒక్కోసారి అతను చేసిన ప్రయత్నాలు సఫలమైతే మరికొన్ని సార్లు అతని ప్రయత్నాలు విఫలమవుతాయి. వాస్తవానికి.. ఎవరైనా తమ జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తుంటే.. ఆ సమయంలో ఓటమి.. లేదా విజయం ఏదోకటి దక్కుతూనే ఉంటుంది. మీరు కూడా ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తుంటే.. తాము చేసే ప్రయత్నంలో ఓటమి ఉండదని నమ్మకంతో ముందుకు సాగండి. ఇలాంటి నమ్మకంతో ప్రయత్నించి ముందుకు సాగేవారు కన్న కలలు ఏదో ఒక రోజు నిజమవుతాయి. మీరు ప్రయత్నించి విసిగిపోయి ఉంటే లేదా ప్రయత్నం విజయవంతం కాకపోతే మీరు నిరాశకు గురవుతుంటే.. ఈ 5 ప్రేరణాత్మక వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి..

  1. జీవితంలో నిరంతరం కృషి చేసే వారి ముందు అదృష్టం తలవంచాల్సిందే.
  2. జీవితంలో ఎల్లప్పుడూ మీ కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మీరు ఆ లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూ ఉండండి.
  3. జీవితంలో ప్రయత్నించడంలో విజయం లేదా ప్రయత్నించడం వైఫల్యంలో ఒక భాగం. మీరు విఫలమవుతారని భయపడితే.. మీరు ప్రయత్నించడానికి భయపడతారు.
  4. మనం ఉత్తమంగా జీవితాన్ని గడపడానికి.. విజయవంతమవ్వడం అవ్వడానికి జీవితానికి సరిపడా కాలం వృధా చేయాల్సిన అవసరం అయితే మనం ఉత్తమంగా జీవించాడని ప్రయత్నించడం అవసరం.
  5. ఇవి కూడా చదవండి
  6. చివరి శ్వాస వరకు జీవితంలో ఎప్పుడూ లక్షాన్ని సాధించడం కోసం ప్రయత్నిస్తూనే  ఉండండి. ఇలా చేయడం వలన మీరు లక్ష్యాన్ని సాధిస్తారు లేదా అనుభవాన్ని పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)