Palmistry: మీ అరచేయి రంగు భవిష్యత్తుకు సంబంధించిన అనేక రహస్యాలను తెలియజేస్తుంది..

అరచేతి రంగు వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. హస్తసాముద్రికం ప్రకారం.. అరచేయి తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు, నీలం రంగులను కలిగి ఉంటుంది. ఈ రంగులు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి.

Palmistry: మీ అరచేయి రంగు భవిష్యత్తుకు సంబంధించిన అనేక రహస్యాలను తెలియజేస్తుంది..
Palmistry
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2023 | 4:32 PM

వ్యక్తి అరచేతిలోని వివిధ రకాల గీతలు, గుర్తులు, పుట్టుమచ్చలు వంటి వాటితో అతని భవిష్యత్ ను తెలియజేసే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అంటారు. శరీర భాగాల తీరుని బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తు, అతని స్వభావం గురించి తెలుసుకుంటారు. అరచేతిలోని  గీతలు, గుర్తులు అతని అదృష్ట, ధనిక, భౌతిక ఆనందాన్ని తెలియజేస్తే..  అరచేతి రంగు వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. హస్తసాముద్రికం ప్రకారం.. అరచేయి తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు, నీలం రంగులను కలిగి ఉంటుంది. ఈ రంగులు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. ఈ రోజు ఒక వ్యక్తి అరచేతి రంగు ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకుందాం.

  1. హస్తసాముద్రికంలో అరచేయి గులాబీ రంగు ప్రాముఖ్యత: హస్తసాముద్రికం ప్రకారం.. అరచేయి గులాబీ రంగులో ఉంటె.. ఆ వ్యక్తి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ విజయాన్ని పొందుతారు. సమాజంలో ప్రశంసలు పొందుతారు. కెరీర్ లో సక్సెస్ అందుకుంటారు. అలాంటి వ్యక్తులు తమ రంగాల్లో ఉన్నత స్థాయిని అందుకోవడంలో సక్సెస్ అవుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అరచేయి గులాబీ రంగులో ఉన్న వ్యక్తులు చాలా చిన్న వయస్సులోనే ప్రజాదరణ పొందుతారు. చాలా అదృష్టవంతులు.
  2. తెల్లటి అరచేయి కలిగిన వ్యక్తులు: చాలా మంది అరచేయి రంగు తెల్లగా ఉంటుంది. హస్తసాముద్రికం ప్రకారం..  అరచేతి రంగు తెల్లగా ఉన్న వ్యక్తులు మానసికంగా,  శారీరకంగా బలహీనంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు స్నేహశీలులు కారు. అంతేకాదు.. తమ మనసులో ఏదైనా ఒక విషయం ప్రవేశిస్తే.. దానిని చాలా రోజులు ఆలోచిస్తూనే ఉంటారు.
  3. అరచేయి ఎరుపు  రంగులో ఉంటే: హస్తసాముద్రిక జ్యోతిష్యం ప్రకారం..  అరచేతి ఎరుపు రంగులో ఉన్న వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అంతేకాదు వీరు చాలా దూరదృష్టి గలవారు. ప్రకృతి అంటే చాలా ఇష్టం. అలాంటి వ్యక్తులు ఉన్నత జీవనశైలిలో జీవిస్తారు. వీరి స్వభావం చాలా ధైర్యంగా..  నిర్భయంగా ఉంటుంది..  ఏ పని చేయడానికీ భయపడరు.
  4. అరచేయి పసుపు రంగులో ఉంటే అర్థం: చాలా మంది ప్రజల అరచేతి రంగు పసుపు లేదా లేత గోధుమరంగులో ఉంటుంది. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, అలాంటి వ్యక్తులు  తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అంతేకాదు వీరి స్వభావం చాలా చిరాకుగా ఉంటుంది. ఎంతో కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే డబ్బు సంపాదించగలరు. అరుదుగా అదృష్టం లభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)