Sankrati 2023: మకర సంక్రాంతికి తీసుకోవాల్సిన చర్యలు.. సూర్య-శని దోషాలకు జ్యోతిష్య పరిహారాలు ఏమిటో తెలుసా
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించగానే మళ్లీ అన్ని రకాల శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి నుంచి చలికాలం తగ్గిపోయి వాతావరణంలో మార్పులు మొదలవుతాయి
మకర సంక్రాంతి పండుగ త్వరలో రాబోతోంది. మకర సంక్రాంతి నాడు..సూర్యదేవుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోకి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. హిందూ మతంలో ..జ్యోతిషశాస్త్రంలో మకర సంక్రాంతి పెద్ద పండుగగా పరిగణించబడుతుంది. హిందూ సనాతన ధర్మంలో చాలా వరకు ఉపవాసాలు ,పండుగలు చంద్ర గణనలపై ఆధారపడి ఉంటాయి. అయితే మకర సంక్రాంతి పండుగను సౌర చక్రాల ఆధారంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతికి గంగాస్నానం.. దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మకర సంక్రాంతి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఖిచ్డీ, ఉత్తరాయణం, పొంగల్, పెద్ద పండుగ, మకర సంక్రాంతి వంటి పేర్లతో జరుపుకుంటారు.
మకర సంక్రాంతి రోజున తీసుకోవాల్సిన చర్యలు:
జ్యోతిష్య పరంగా మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం.. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించగానే మళ్లీ అన్ని రకాల శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి నుంచి చలికాలం తగ్గిపోయి వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. శరదృతువు ముగిసి.. వసంతకాలం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి నాడు.. సూర్య దేవుడు తన కొడుకు శనీశ్వరుడి ఇంటికి వెళ్తాడు.అక్కడ తండ్రి, కొడుకుల సమావేశం అవుతారు. వాస్తవానికి సూర్యుడు, శని ఒకరితో ఒకరు శత్రుత్వం కలిగి ఉంటారు. అలాంటి పరిస్థితిలో సూర్య తన కొడుకు ఇంట్లో నెల రోజులు ఉండడం శుభపరిణామం. గంగాస్నానం, సూర్యారాధన,ఆచారాలకు మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతే కాకుండా.. ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం, కిచడీ దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
సూర్య-శని దోషాలకు జ్యోతిష్య పరిహారాలు
- వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.ప్రతి ఒక్క జాతకంలో సూర్యుడు, శని ఇద్దరికీ ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తికి గౌరవం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, శని అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా ఆనందం, సంపదలు ఉంటాయి. మకర సంక్రాంతి రోజున శని దేవుడి ఆశీస్సులు పొందడానికి కొన్ని చర్యలు చాలా ప్రభావవంతంగా పరిగణించబడ్డాయి.
- మకర సంక్రాంతి నాడు గంగాస్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు, బెల్లం, ఉసిరితో చేసిన కిచడీని దానం చేయాలి. దీంతో శనీశ్వరుడు సంతోషం వ్యక్తం చేశాడు.
- మకర సంక్రాంతి నాడు నియమ నిబంధనల ప్రకారం సూర్యభగవానుని పూజించి, మంత్రాలు జపించి, రాగి పాత్రతో అర్ఘ్యం సమర్పించాలి.
- మకర సంక్రాంతి నాడు తలస్నానం చేసే సమయంలో నల్ల నువ్వులను నీటిలో వేసి స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పరిహారంతో.. మనుషులు వ్యాధుల నుండి విముక్తి పొందుతాడు.
- మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు, బెల్లం లడ్డూలు, దుప్పటి, నెయ్యి దానం చేయడం శుభప్రదం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)