Mangal Gochar 2023: ఈ నెల 13న వృషభరాశిలో ప్రవేశించనున్న కుజుడు.. 12 రాశుల్లో కొందరికి తిరుగులేని అదృష్టం..

ఎవరి జాతకంలో మంగళకరమైన కుజుడు శుభ దృష్టితో ఉంటాడో.. ఆ వ్యక్తులు ఎల్లప్పుడూ ధైర్యంగా , నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు. వారు ప్రతి పనిలో మంచి విజయాన్ని పొందుతారు.

Mangal Gochar 2023: ఈ నెల 13న వృషభరాశిలో ప్రవేశించనున్న కుజుడు.. 12 రాశుల్లో కొందరికి తిరుగులేని అదృష్టం..
Mangal Gochar 2023
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2023 | 5:09 PM

వేద జ్యోతిషశాస్త్రంలో..  భూమిదేవి కుమారుడు కుజుడు. ధైర్యం, సాహసం, శక్తి , యుద్ధంనీతి ఇతని సొంతం. కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి. ఎవరి జాతకంలో మంగళకరమైన కుజుడు శుభ దృష్టితో ఉంటాడో.. ఆ వ్యక్తులు ఎల్లప్పుడూ ధైర్యంగా , నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు. వారు ప్రతి పనిలో మంచి విజయాన్ని పొందుతారు. మరోవైపు.. ఏ వ్యక్తి  జాతకంలో కుజుడు అశుభంగా ఉంటే..  ఆ వ్యక్తి నష్టాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. 2023 జనవరి 13న వృషభరాశిలో కుజుడు ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో కుజుడి అన్ని రాశులను  ఎలా ప్రభావితం చేయనున్నాడో.. ఎటువంటి ఫలితాలను ఇవ్వనున్నాడో తెలుసుకుందాం..

మేష రాశి – ఈ రాశివారు ఆర్థిక రంగంలో బలంగా ఉంటారు. ఇతరులకు ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు కూడా పరిష్కారమవుతాయి. కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు. ఈ రాశి వ్యక్తులు తమ మొండితనాన్ని వదిలి.. అత్యుత్సాహన్నీ అదుపులో ఉంచుకుని పని చేస్తే..మరింత విజయవంతమవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

వృషభ రాశి– ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలకు మరికొంత సమయం పడుతుంది. ఉద్యోగ ,వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరు  కొత్త ఒప్పందాన్ని చేసుకోవాలనుకుంటే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే..  గ్రహ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి – ఈ రాశివవారి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. కోర్టు కేసులను బయట  పరిష్కరించుకోవడం వివేకవంతమైన చర్యగా పరిగణించవచ్చు. ఈ కాలంలో ఎవరికీ ఎక్కువ అప్పు ఇవ్వకండి.. లేకుంటే ఈ రాశివారు  ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి – కుజుడి సంచారం ఈ రాశివారికి శుభం కలిగిస్తుంది. పనిలో గొప్ప విజయాన్ని తెస్తుంది. పోటీలో పాల్గొనే విద్యార్థులు,  పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మంచి మార్కులు సాధించడానికి మరింత కృషి చేయవలసి ఉంటుంది. పిల్లల ఆందోళనలు దూరమవుతాయి. ప్రేమకు సంబంధించిన విషయాలలో ఉదాసీనత ఉంటుంది.

సింహ రాశి – కుజుడి ప్రభావంతో ఈ రాశివారు విజయాన్నిఅందుకుంటారు. ఈ రాశివారు తమ వ్యూహాలను గోప్యంగా ఉంచుకుంటే, మరింత విజయాలను అందుకుంటారు. ఈ రాశివారు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్, పోలీస్ లేదా ఆర్మీ మొదలైన రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకునేవారికి అవకాశం అనుకూలంగా ఉంటుంది.

కన్య  రాశి– ఈ రాశివారిపై గౌరవం పెరుగుతుంది. వీరు తీసుకునే నిర్ణయాలు ప్రశంసించబడతాయి. స్థిరాస్తి విషయాల్లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది.

తుల రాశి–  ఈ రాశివారు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో మంచి మార్కులు సాధించేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే.. కుజ గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి – ఈ రాశి చక్రంలోని ఏడవ ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల  ఈ రాశివారి ప్రతిష్ట పెరుగుతుంది. వివాహ చర్చలు కూడా సఫలమవుతాయి. వైవాహిక జీవితంలో వివాదాలు రానివ్వకండి. అత్తమామల వైపు నుంచి కొంత దూరం పెరగవచ్చు. మధ్యకాలంలో షేర్ బిజినెస్ చేయడం మానుకోవడం ఉత్తమం. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు రాశి – కోర్టు కేసులలో ఈ రాశివారికి అనుకూలంగా నిర్ణయం వచ్చే సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో  ఎటువంటి అప్పు తీసుకునే ప్రయత్నాలు చేయవద్దు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి – ఈ రాశి ఉద్యోగులు ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. విద్యార్థులకు వృషభ రాశిలో కుజుడు సంచరించడం శుభసూచకం.

కుంభ రాశి –  ఈ రాశి వ్యక్తుల స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వాహనం కొనాలనుకున్నా వారికీ కుజ గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. కుజుడు కుడి వైపున ఉంటే అది మీకు శుభ సూచకం.

మీన రాశి  – ఉద్యోగస్తులకు కుజుడి సంచారం గొప్ప విజయాన్ని కలిగిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే