Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Transit 2023: ఈనెల 17న 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని సంచారం.. ఏ రాశులకు అదృష్టాన్ని తెలుస్తుందంటే

ఎందుకంటే నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం శనీశ్వరుడు. ఆయన ఒక రాశి నుండి మరో రాశిలోకి రావడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని సంచారం అనేక రాశులపై.. జీవితాలను ప్రభావితం చేస్తుంది.

Saturn Transit 2023: ఈనెల 17న 30 ఏళ్ల తర్వాత  కుంభరాశిలో శని సంచారం.. ఏ రాశులకు అదృష్టాన్ని తెలుస్తుందంటే
Shani Sade Sati Impact On Zodiac sign
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2023 | 6:13 PM

సూర్యదేవుడు తన కొడుకు శనీశ్వరుడు రాశిలోకి జనవరి 15 న ప్రవేశించనున్నాడు. అనంతరం రెండు రోజుల తరువాత.. అంటే జనవరి 17వ తేదీన శనీశ్వరుడు కుంభరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. మకరం, కుంభ రాశులు శనీశ్వరుడు సొంత రాశులు. శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత మళ్లీ కుంభరాశిలో సంచరించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు సంచారం ఎల్లప్పుడూ ముఖ్యమైనది.. ఎందుకంటే నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం శనీశ్వరుడు. ఆయన ఒక రాశి నుండి మరో రాశిలోకి రావడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని సంచారం అనేక రాశులపై.. జీవితాలను ప్రభావితం చేస్తుంది.

30 సంవత్సరాల తర్వాత శని సంచారం జ్యోతిష్య శాస్త్రంలో.. శనీశ్వరుడు రెండు రాశులకు అధినేత. మకర, కుంభ రాశులు ఇతని సొంత రాశులు. శని ప్రస్తుతం మకరరాశిలో ఉన్నాడు.. అయితే జనవరి 17 తర్వాత.. తన రెండవ రాశిలోకి సంచరించనున్నాడు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ కుంభరాశిలో శనీశ్వరుడు  సంచరించనున్నాడు. శని ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఆ విధంగా మొత్తం 12 రాశుల్లో ఒక రౌండ్ పూర్తి చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది.

కుంభరాశిపై శని ప్రభావం ఎంతకాలం ఉంటుందంటే..  జనవరి 17న కుంభరాశిలో శని సంచారం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారిపై శని.. రెండవ దశ అర్ధభాగం ప్రారంభమవుతుంది. కుంభరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం జనవరి 24, 2020 నుండి ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఈ రాశివారికి జూన్ 03, 2027న ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. అయితే శని మహాదశ కారణంగా ఫిబ్రవరి 23, 2028న కుంభరాశి వారు శని గ్రహం నుండి విముక్తి పొందుతారు.

ఇవి కూడా చదవండి

కుంభరాశిలో శని సంచారం వల్ల ఏ రాశుల వారికి సమస్యలు కలుగుతాయంటే..  శని గమనంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో.. అప్పుడు అన్ని రాశుల వారిపై విస్తృత ప్రభావం చూపుతుంది. జనవరి 17న కుంభరాశిలో శని సంచరించడం వల్ల  మిథున, తుల, ధనస్సు రాశి వారిపై ఏలినాటి శని, ధైయా తొలగిపోతుంది. మీనం, మకర, కుంభరాశులపై శని ఏలినాటి ప్రభావం.. కర్కాటకం, వృశ్చికం రాశులపై ధైయా ప్రభావం కొనసాగుతోంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండండి.

శని గ్రహం రాశి మార్పు… ప్రభావాలు వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… శని రాశిలో ఎప్పుడైతే మార్పు ఉంటుందో.. అప్పుడు భారీ మార్పులు కలుగుతాయి. జ్యోతిషశాస్త్రంలో, శని, కుజుడు, రాహు-కేతువులు తమ రాశులను మార్చుకోవడంతో ప్రత్యేక ప్రభావం పడనుంది. రెండున్నరేళ్ల క్రితం జనవరి 24, 2020న 30 ఏళ్ల తర్వాత శని తన సొంత రాశి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం అంటువ్యాధులు, యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కుంభరాశిలోకి శని అడుగు పెట్టన్నాడు.. శని మార్పు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

కెరీర్‌పై ప్రభావం జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జనవరి 17న కుంభరాశిలో శని ప్రవేశించడం వల్ల కెరీర్ రంగంలో చాలా మార్పులు రావచ్చు. అధికంగా  కష్టపడి మంచి ఫలితాలను పొందవచ్చు. పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

ఉద్యోగం ప్రభావం కుంభరాశిలో శని సంచారం వల్ల ఉద్యోగాలు చేసే వారికి శుభ సంకేతాలు ఉన్నాయి. కార్యక్షేత్రంలో విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచి ఆఫర్లు పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు..
Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు..
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..