Joshimath Sinking: జోషిమఠం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని మోడీ.. అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ

బాధిత ప్రజల నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రధాని సూచనలు చేశారని ముఖ్యమంత్రి ధామి తెలిపారు.

Joshimath Sinking: జోషిమఠం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని మోడీ.. అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ
Joshimath Land Subsidence
Follow us

|

Updated on: Jan 08, 2023 | 4:16 PM

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠం విపత్తు తర్వాత అక్కడ పరిస్థితిని.. ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న భద్రతా చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జోషిమఠాన్ని కాపాడేందుకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.  ప్రధాని మోడీ ఆదివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా, ఈ విపత్తు వల్ల ఎంత మంది ప్రజలు ప్రభావితమయ్యారు..  ఎంత నష్టం జరిగింది. బాధిత ప్రజల నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రధాని సూచనలు చేశారని ముఖ్యమంత్రి ధామి తెలిపారు. అలాగే కేంద్రం నుంచి కూడా అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ధామీ..  జోషిమఠం పరిస్థితిపై ప్రధాని మోడీ తనతో మాట్లాడారని చెప్పారు. ఈ ఘటన ఇప్పుడిప్పుడే తెరపైకి వచ్చిందని ప్రధానికి చెప్పానని.. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందన్నారు. పర్వతాల మీద ఉన్న రాళ్లను మోసే సామర్థ్యం ఎంత అనేది ఇందులో కనిపిస్తోంది. ఈ ఘటన జరిగిన రోజు నుంచి తాను ప్రతిరోజూ ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడుతున్నానని.. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి సమాచారం ఇస్తున్నానని ముఖ్యమంత్రి ధామి చెప్పారు. ఇప్పుడు ఈ విషయమై ప్రధానితో వివరంగా చర్చించారు. ఇప్పటి వర్కకూ ఎంత నష్టం జరిగింది, ఎంత మంది నష్టపోయారు..  కొనసాగుతున్న సహాయక చర్యలు వంటి పూర్తి సమాచారాన్ని అందించారు. దీంతో పాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి,

జోషిమఠాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తున్నారు. నిపుణులు, శాస్త్రవేత్తల బృందాన్ని రంగంలోకి దింపారు. మొత్తం ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణ పనులు నిషేధించబడ్డాయి. ఇప్పుడు నిపుణుల నివేదిక తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించడం లేదా వదిలివేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, పిఎంఓలో కేబినెట్ సెక్రటరీ , భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు..  నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ విపత్తులో నష్టపోయిన ప్రజలకు ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల్లో వసతి కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటని .. త్వరలో అన్ని కుటుంబాలకు ఆరు నెలల పాటు మరోచోట ఉండేందుకు ఏర్పాటు చేస్తామని..  నెలకు రూ.4వేలు చొప్పున అద్దె ఇస్తామని స్పష్టం చేశారు సీఎం ధామి. ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్ ఖాతాలో కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు చేపట్టింది.. తక్షణ చర్యలని.. అయితే నిర్వాసితులందరికీ పునరావాసం కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొంచాడనున్నమని తెలిపారు. బాధితులకు శాశ్వత నివాసం కోసం తగిన భూములు వెతుకుతున్నామని తెలిపారు.

విపత్తుపై పీఎంవోలో సమీక్షా సమావేశం జోషిమఠం వద్ద ఉన్న పరిస్థితులపై ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పికె మిశ్రా, భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ, సీనియర్ అధికారులతో పిఎంఓలో పరిస్థితిని సమీక్షిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. జోషిమఠం జిల్లా మేజిస్ట్రేట్, ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులను కూడా ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ అధికారులు సంబంధిత నివేదికతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..