Viral Video: కదులుతున్న రైలు ఎక్కుతూ జారి పడిన వ్యక్తి.. రక్షించిన RPF కానిస్టేబుల్.. షాకింగ్ వీడియో వైరల్
స్టేషన్‌లో రైలు ఆగకముందే ఒక ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు..కాలు జారి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న గ్యాప్‌లో పడబోయాడు. అయితే ఆ ప్రయాణికుడి అదృష్టవశాత్తూ..
కదులుతున్న రైలు నుంచి దిగవద్దు.. కదులుతున్న రైల్లోకి ఎక్కే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు ప్రయాణికులను హెచ్చరిస్తూ ప్రకటనలు చేసినా.. చాలామంది ప్రయాణీకులు.. త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే తొందరోనో.. లేదా.. కదిలే రైలునుంచి ఎక్కడం దిగడం ఓ సరదాగానో భావిస్తూ తమ ప్రాణాలతో తామే చెలగాటమాడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబందించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా జారిపడిన వ్యక్తి ప్రాణాలను ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లోని ఎన్‌ఎఫ్‌ఆర్‌లోని కతిహార్ డివిజన్ పరిధిలోని పూర్నియా రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ఓ వృద్ధుడు జారిపడ్డాడు. రైలు .. ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న గ్యాప్‌లోకి జారిపడి నలిగిపోవాల్సిన వ్యక్తిని చూసి.. వెంటనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యాడు. ఆ ప్రయాణికుడిని చాలా చాకచక్యంగా ప్రాణాపాయం నుంచి కాపాడాడు.. దీంతో ఆ వృద్ధ ప్రయాణీకుడు ప్రమాదం అద్భుతంగా తప్పించుకున్నాడు.
ఆ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు. అతని ధైర్యం, సాహసానికి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ వీడియోను నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే షేర్ చేసింది.
వైరల్ వీడియో
Alert RPF Constable Sanjiv Kumar Singh, on-duty at the Purnea station under Katihar division of NFR saved a passenger who tried to board a running train today at about 11-00 am @RailMinIndia @ani_digital pic.twitter.com/T10X24wrLw
— Northeast Frontier Railway (@RailNf) January 3, 2023
“ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సింగ్, ఎన్‌ఎఫ్‌ఆర్‌లోని కతిహార్ డివిజన్ పరిధిలోని పూర్నియా స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు, ఈ రోజు ఉదయం 11-00 గంటలకు నడుస్తున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని రక్షించాడు” అనే క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోకు..
వీడియోలో.. కదులుతున్న రైలు పూర్నియా స్టేషన్‌కు చేరుకుంటుంది.. అయితే, స్టేషన్‌లో రైలు ఆగకముందే ఒక ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు..కాలు జారి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న గ్యాప్‌లో పడబోయాడు. అయితే ఆ ప్రయాణికుడి అదృష్టవశాత్తూ.. ఇది అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సంజీవ్ చూశాడు.. వెంటనే స్పందించి అతన్ని బయటకు లాగాడు. సంజీవ్ ధైర్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
“ప్రయాణికుల ప్రాణాలను కాపాడే నిబద్ధత, సాహసోపేతమైన ప్రయత్నానికి వందనం” అని ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు “సంజీవ్ చేసిన గొప్ప పని” అని మరొకరు.. RPF నిబద్దతను చూస్తుంటే.. చాలా గర్వంగా ఉందంటూ .. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి ధైర్యవంతులకు బహుమతి ఇవ్వాలని నెటిజన్లు బీహార్ ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..