Accident Viral Video: రోడ్డు మీద ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. ఇలాంటి యాక్సిడెంట్ ని ఎప్పుడూ చూసి ఉండరు..

ఈ వీడియో చూశాక కారణం లేకుండా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయా అనిపించక మానదు ఎవరికైనా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్లు ఉంది.. కొంచెం దూరంలో వాహనాలు ఆగిఉన్నాయి. ఆయితే ఇంతలో ఒక వ్యక్తి.. రోడ్డుమీద నడుస్తూ  అత్యంత ఆకర్షణకు కేంద్రంగా నిలిచాడు.

Accident Viral Video: రోడ్డు మీద ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. ఇలాంటి యాక్సిడెంట్ ని ఎప్పుడూ చూసి ఉండరు..
Accident Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 7:22 PM

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో అధికంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా తమ అవయవాలను కోల్పోతున్నారు. శాశ్వత అంగవైకల్యంగా గలవారీగా మిగిలిపోతున్నారు. అందుకనే ప్రమాదాల నివారణ కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. వాహనాలను నడిపే సమంయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు.  బైక్స్, వెహికిల్స్ నడిపే సమయంలో మాత్రమే కాదు.. రోడ్డుపై నడుస్తున్న సమయంలో కూడా జాగ్రత్త అని చెబుతారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇతరుల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి . ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చాలా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు.. ఈ  సంఘటన ఎందుకు ఎలా జరిగింది అని కూడా ఆలోచిస్తారు.

అసలే ఈ వీడియో చూశాక కారణం లేకుండా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయా అనిపించక మానదు ఎవరికైనా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్లు ఉంది.. కొంచెం దూరంలో వాహనాలు ఆగిఉన్నాయి. ఆయితే ఇంతలో ఒక వ్యక్తి.. రోడ్డుమీద నడుస్తూ  అత్యంత ఆకర్షణకు కేంద్రంగా నిలిచాడు. వీడియోలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి పరుగెత్తుతున్నాడు.. అప్పుడు ఒక కారు స్పీడుగా వస్తోంది. దీంతో అతను రోడ్డుమీద అడ్డంగా పడిపోయాడు. అయితే కారు అతడిని ఢీకొట్టకపోవడం గర్వకారణం, అయితే డ్రైవర్ కొంచెం ముందుకు వెళ్లాక బ్రేకులు వేశాడు. రోడ్డుమీద నుంచి లేచి మళ్ళీ రోడ్డుమీద నడుస్తున్నాడు.. ఇంతలో మరో కారు అతని వైపుకి వెళ్తోంది. అప్పుడు అతను రోడ్డుమీద పరుగులు తీసిన విధానం నవ్వువస్తుంది. అతి కష్టం మీద అతను తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అదే సమయంలో.. వీడియోలో ఎటువంటి కారణం లేకుండా చాలా వాహనాలు ఢీకొన్నట్లు చూపించారు.

ఇవి కూడా చదవండి

ఈ హృదయాన్ని కదిలించే వీడియో @BornAKang అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 45 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 12 మిలియన్లు మంది చూశారు. 2 లక్షల 87 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత.. భిన్నమైన కామెంట్స్ చేశారు.  ఒకరు .. ఈ రోడ్డు ప్రమాదం వీడియో పాతది అని చెప్పారు. అంతేకాదు దక్షిణ కొరియాలోని సియోల్ సమీపంలో ఒక ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది.. ఇందులో 20 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని అప్పటి సంఘటన గురించి కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..