అబ్బ.. అబ్బాయిలు అదరగొట్టేశారు.. లెహంగాలలో ఐష్ పాటకు దుమ్ములేపారు.. వీడియో చూస్తే రెండు కళ్లు చాలవు

రెండు దశాబ్దాల తర్వాత కూడా దేవదాస్ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సుపరిచితమే.. షారుఖ్ ఖాన్ హీరోగా.. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా 2002లో విడుదలైన దేవదాస్ చిత్రం..

అబ్బ.. అబ్బాయిలు అదరగొట్టేశారు.. లెహంగాలలో ఐష్ పాటకు దుమ్ములేపారు.. వీడియో చూస్తే రెండు కళ్లు చాలవు
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2023 | 1:34 PM

రెండు దశాబ్దాల తర్వాత కూడా దేవదాస్ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సుపరిచితమే.. షారుఖ్ ఖాన్ హీరోగా.. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా 2002లో విడుదలైన దేవదాస్ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఊర్రుతలూగించింది. ఇప్పటికీ దీనిలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ “డోలా రే డోలా” పాటకు అదిరిపోయే స్టేప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్లాసికల్ కల్ట్ తో వచ్చిన ఈ పాటలో ఇద్దరి డాన్స్ చూస్తే అభిమానులకు కనులవిందే.. ప్రస్తుతం, ఈ పాటకు సంబంధించిన ఓ రీల్ నెట్టింట వైరల్ గా మారింది. న్యూయార్క్ వీధుల్లో ఒక భారతీయుడు, కెనడియన్ వ్యక్తులు కలిసి డోలారే డోలా రే.. పాటకు అదిరిపోయే నృత్యం చేశారు. ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సూపర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వైరల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఇండియాకు చెందిన జైనిల్ మెహతా, కెనడాకు చెందిన అలెక్స్ వాంగ్ అదిరిపోయే లెహంగాలు ధరించి దేవదాస్ పాటకు డ్యాన్స్ చేశారు. వారు చెప్పులు లేకుండానే ఉల్లాసమైన ఈ పాటకు నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. విదేశాలలో ప్రదర్శించిన ఈ అద్భుతమైన భారతీయ నృత్యాన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు పులకించిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Alex Wong (@alexdwong)

డ్యాన్స్‌ని చూసి పరవశిస్తున్నామంటూ నెటిజన్లు ఇద్దరినీ.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. న్యూయార్క్ వీధుల్లో చెప్పులు లేకుండా.. ఇద్దరూ ఎంత సునాయాసంగా ప్రదర్శించారో అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS