AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin: ఫొటో ఏదైనా పుతిన్‌ వెంట నీడలా అందమైన మహిళ.. మిస్టరీగా మారిన రష్యా అధ్యక్షుడి వ్యవహారం.. 

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు.. ఉక్రెయిన్‌పై యుద్ధం నాటినుంచి పుతిన్‌కు సంబంధించిన పలు రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి.

Vladimir Putin: ఫొటో ఏదైనా పుతిన్‌ వెంట నీడలా అందమైన మహిళ.. మిస్టరీగా మారిన రష్యా అధ్యక్షుడి వ్యవహారం.. 
Vladimir Putin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 03, 2023 | 1:16 PM

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు.. ఉక్రెయిన్‌పై యుద్ధం నాటినుంచి పుతిన్‌కు సంబంధించిన పలు రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సమస్య ఏదైనా సరే.. ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఆయన వ్యవహరించే తీరు.. అందరికంటే భిన్నంగా ఉంటుంది.. చిన్నతనంలోనే జూడో, బ్లాక్‌ బెల్ట్‌ లాంటి వాటిల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పుతిన్‌.. రష్యా రాజకీయాల్లో అరంగ్రేటం చేసి క్రమంగా ఎన్నో పదవులను అనుభవించారు. గూఢాచార్యం కూడా చేసినట్లు చెబుతారు. ఇంకా ఆయన ఆరోగ్యానికి సంబంధించి రోజుకో పుకారు పుట్టుకువస్తోంది. బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారని రోజూ జింక రక్తం తాగుతున్నారన్న వార్తలు వచ్చాయి. సోవియట్‌ యూనియన్‌ దేశాలలో కీలక నేతగా ఎదిగిన పుతిన్‌.. ఉక్రెయిన్ తో యుద్ధం అనంతరం అన్ని దేశాల నుంచి వ్యతిరేకతను పొందారు. అగ్రరాజ్యం అమెరికా సహా.. సోవియట్ యూనియన్‌లోని పలుదేశాలకు, ఈయూ ఇలా ఎన్నో దేశాలకు సవాల్‌ చేసే నాయకుడిగా ఎదిగారు. ఇప్పటికీ.. ఆయన్ను వ్యతిరేకిస్తున్న దేశాల్లో పుతిన్‌ నియమించిన గుఢాచారులు పనిచేస్తున్నారంటే రష్యా అధ్యక్షుడు ఎలాంటి వారో అందరికీ దాదాపు అర్ధం అయ్యే ఉంటుంది. అలాంటి నేత అయిన పుతిన్‌ భద్రత ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనురెప్ప వాల్చే క్షణంలోనే అన్నింటిని పసిగట్టే స్పైలు, అత్యాధునిక ఆయుధాలు.. ఎవరినైనా మట్టుబట్టె ప్రత్యేక సైనికులు ఉంటారు.

అయితే.. తాజాగా పుతిన్‌ రక్షణ కల్పిస్తున్న ఓ మహిళకు సంబంధించిన కొన్ని చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వ్లాదిమిర్ పుతిన్ తన ప్రెసిడెన్షియల్ ఫోటో ఆప్స్‌లో విభిన్న పాత్రలు పోషిస్తున్న ఒక మహిళ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్‌.. విభిన్నమైన వస్త్రధారణలో ఉన్న ఒకే మహిళను తనవెంటనే ఎప్పుడూ ఉండేలా నియమించుకున్నట్లు ఓ జర్నలిస్ట్ పసిగట్టడంతో ఇది సంచలనంగా మారింది. ఒక మహిళ రష్యా అధ్యక్షుడితో అనేక చిత్రాలలో కనిపించడాన్ని గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

పుతిన్‌ వెంట ఉన్న అందమైన మహిళ రహస్యాన్ని మొదట UKలో ఉన్న బెలారసియన్ జర్నలిస్ట్ టాడ్యూస్జ్ గిక్జాన్ కనిపెట్టినట్లు న్యూస్‌వీక్ ప్రచురించింది. పుతిన్ పక్కన ఉన్న గుంపులో అందగత్తె కనిపించిన మూడు ఫోటోలను గిక్జాన్ పోస్ట్ చేశారు. ఆమె మొదటి చిత్రంలో సైనికురాలిగా, రెండవ చిత్రంలో నావికునిగా, మూడవ చిత్రంలో పుతిన్ వెనుక మతపరమైన వేడుకలో పాల్గొన్నట్లుగా కనిపిస్తుంది.

రష్యా అధ్యక్షుడి ఫోటోల కోసం క్రెమ్లిన్ ఒక నటిని నియమించుకున్నట్లు ఈ చిత్రాలు ఊహాగానాలకు దారితీశాయి. ఫోటోలలో విభిన్న వస్త్రధారణతో ఆమె ఉండటం సంచలనంగా మారింది. దీంతోపాటు ఒకేలా పలువురు ఉండటం కూడా చర్చనీయాంశమైంది. CNN కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్ కూడా వివిధ ఈవెంట్‌లలో తీసిన ఫోటోలలో అనేక సాధారణ ముఖాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆమెతో ఉన్న పలువురు వ్యక్తులు అంగరక్షకులా..? నటులా అంటూనే.. ప్రత్యేకంగా మహిళ గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తారు.

కైవ్ పోస్ట్ కరస్పాండెంట్ జాసన్ జే స్మార్ట్ ఆ మహిళను నటిగా పేర్కొన్నారు. మహిళ సైనికురాలిగా కనిపించిన మొదటి ఫోటో పుతిన్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తీసిందని.. మతపరమైన వేడుక ఫోటో ఈస్టర్ ది అని పేర్కొన్నారు. ఫోటోలలో ఉన్న అందగత్తె, ఇతర వ్యక్తులు పుతిన్ అధ్యక్ష రక్షణ కార్యాలయంలో భాగమై ఉంటారని ఆయన తెలిపారు.

అయితే, BFM బిజినెస్‌లో అసోసియేట్ ఎడిటర్ జర్నలిస్ట్ రాఫెల్ గ్రాబ్లీ.. ఆ మహిళను రష్యన్ ఫెడరేషన్ పర్యావరణ డిప్యూటీ మంత్రి స్వెత్లానా రాడ్చెంకోగా పేర్కొన్నారు. అయితే.. ఇంతకీ ఆమె ఎవరన్నది మాత్రం మిస్టరీగానే ఉంది..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..