ఒడిశాలో రష్యా ప్రముఖుల అనుమానాస్పద మరణాలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

ఒడిశాలో రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్, ఆయన స్నేహితుడు వ్లాదిమీర్ మెద్వదేవ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాళ్లిద్దరూ గంజాయి సేవించినట్టు నిర్ధారణ అయింది....

ఒడిశాలో రష్యా ప్రముఖుల అనుమానాస్పద మరణాలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Russian Death In Odisha
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 03, 2023 | 1:21 PM

ఒడిశాలో రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్, ఆయన స్నేహితుడు వ్లాదిమీర్ మెద్వదేవ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాళ్లిద్దరూ గంజాయి సేవించినట్టు నిర్ధారణ అయింది. గంజాయితో పాటు మరో మత్తునిచ్చే ద్రవాన్ని సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. సాయి ఇంటర్నేషనల్ హోటల్ లో వారికి గంజాయితో మత్తునిచ్చే డ్రింకులను సప్లై చేసిందెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 27 వరకూ సాయి హోటల్ లో వచ్చిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. ఈ అసహజ మరణాలపై నాలుగు రోజులుగా విచారణ చేపడుతున్న క్రైం బ్రాంచ్ కు రోజుకో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. బైదెనోవ్‌ మృతదేహంలో గంజాయి వాసనతో కూడిన 100 మి.లీ. ద్రవ పదార్థం ఉన్నట్లు నివేదిక పేర్కొనడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగుంటుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

రష్యా ప్రముఖుల మరణాలకు సంబంధించి.. పోలీసు యంత్రాంగం తీసుకున్న కార్యాచరణ నివేదికను సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. రబీంద్ర మిశ్రా అనే మానవ హక్కుల కార్యకర్త కమిషన్‌ను ఆశ్రయించడంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌గా తీసుకుంది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ నివేకానందశర్మను ఎన్‌హెచ్‌ఆర్సీ కోరింది. దీంతో క్రైం బ్రాంచ్‌ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు. హోటల్ సిబ్బంది నుంచి యాజమాన్యం వరకు అందరినీ విచారిస్తున్నట్లు సమాచారం.

అయితే.. అధికారుల విచారణకు సిబ్బంది అందరూ సహకరిస్తున్నారని హోటల్ నిర్వాహకులు చెప్పారు. వారు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెబుతున్నట్లు వెల్లడించారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 27 వరకు హోటల్‌లో బస చేసిన వారి వివరాలను సేకరించిన అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ఒడిశాలో మ‌రో ర‌ష్యా వ్యక్తి శ‌వ‌మై తేలాడు. పారాదీప్ పోర్ట్‌లో లంగరు వేసిన ఓడలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ల రష్యన్ వ్యక్తి మరణించాడు. గ‌త 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్యక్తి ఒడిశాలో మ‌ర‌ణించడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం