Telangana Crime News: భార్య చనిపోయిన గంటకే భర్త ఆత్మహత్య.. ఏం కష్టం వచ్చిందో..?

ఏ కష్టం వచ్చిందో భార్య అర్ధంతరంగా తనువు చాలించింది. అర్ధాంగి మరణాన్ని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన..

Telangana Crime News: భార్య చనిపోయిన గంటకే భర్త ఆత్మహత్య.. ఏం కష్టం వచ్చిందో..?
Telangana Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2023 | 8:51 PM

ఏ కష్టం వచ్చిందో భార్య అర్ధంతరంగా తనువు చాలించింది. అర్ధాంగి మరణాన్ని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా గరేడుపల్లి మండలం కల్మల చెర్వే గ్రామానికి చెందిన గుంటి శివ, శివ యామిని దంపతులు. వివాహం అనంతరం వీరి కాపురం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. శివ మిర్యాలగూడలో మీ సేవ కేంద్రాన్ని నడిపించేవాడు. ఇక భార్య శివ యామిని కూడా ఆధార్ సెంటర్‌ను నడిపిస్తూ జీవనం సాగించేవారు. ఐతే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో తరుచు ఇద్దరూ గొడవపడేవారు. ఈ క్రమంలో గత శుక్రవారం (డిసెంబర్ 30) ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. భర్తతో విసిగిపోయిన శివ యామిని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది. భర్త శివ ఇంటికి చేరుకునే సరికి ఫ్యానుకు వేలాడుతున్న భార్య కనిపించింది.

భార్య మరణాన్ని తట్టుకోలేక మిర్యాలగూడలోని ఐలాపురం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో దూకి శివ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యామిని భర్తగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులిద్దకూ మరణించడంతో వారి ఒక్కగానొక్క కుమారుడి రోదన ప్రతిఒక్కరి హృదయాలను కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి