AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం..! గాల్లో ఉండగానే రెండు హెలికాఫ్టర్లు ఢీ.. నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

రెండు హెలికాఫ్టర్లు గాల్లోనే ఢీకొన్న ఘటన సోమవారం మధ్యాహ్నం (జనవరి 2) ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు..

ఘోర ప్రమాదం..! గాల్లో ఉండగానే రెండు హెలికాఫ్టర్లు ఢీ.. నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Two Helicopters Crush
Srilakshmi C
|

Updated on: Jan 02, 2023 | 5:30 PM

Share

రెండు హెలికాఫ్టర్లు గాల్లోనే ఢీకొన్న ఘటన సోమవారం మధ్యాహ్నం (జనవరి 2) ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన గోల్డ్‌కోస్ట్‌ టూరిస్ట్ హాట్‌స్పాట్‌లో ఈ ప్రమాదం జరిగింది

గోల్డ్ కోస్ట్‌ బీచ్‌లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో ఓ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా మరొకటి ల్యాండింగ్ అయినట్లు క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసు యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ గ్యారీ వోరెల్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి హెలికాఫ్టర్‌ పూర్తిగా ధ్వంసం అవ్వగా.. మరొకటి పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు వ్యక్తులు హెలికాప్టర్‌లలోని ప్రయాణీకులే కావడం విశేషం. హెలికాప్టర్ల క్రాష్‌కు సంబంధించిన ఫుటేజీలో ఒక హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని సమీపంలోని మరో హెలికాఫ్టర్‌ కూలిపోయినట్లు కనిపిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాచర్యలు చేపట్టింది. హెలికాఫ్టర్ల క్రాష్‌కు గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. జనవరిలో ఆస్ట్రేలియాలో వేసవి కాలం నడుస్తున్నందున్న గోల్డ్ కోస్ట్ ప్రాంతం పర్యాటకులతో అత్యంత రద్దీగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!