AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: రష్యాకు సవాల్‌ విసురుతోన్న ఉక్రెయిన్‌.. ఏడాదైనా, రెండేళ్లయినా తగ్గేదిలే..

రష్యాకు ఉక్రెయిన్‌ సవాల్‌ విసురుతోంది. ఏడాదైనా, రెండేళ్లయినా రష్యాకు తలొగ్గేదే లేదంటోంది. పైగా కౌంటర్‌ ఎటాక్స్‌తో రష్యాకు వణుకు పుట్టిస్తోంది. రీసెంట్‌గా ఉక్రెయిన్‌ జరిగిన క్షిపణ..

Russia-Ukraine War: రష్యాకు సవాల్‌ విసురుతోన్న ఉక్రెయిన్‌.. ఏడాదైనా, రెండేళ్లయినా తగ్గేదిలే..
Russia Ukraine War
Subhash Goud
|

Updated on: Jan 03, 2023 | 9:00 AM

Share

రష్యాకు ఉక్రెయిన్‌ సవాల్‌ విసురుతోంది. ఏడాదైనా, రెండేళ్లయినా రష్యాకు తలొగ్గేదే లేదంటోంది. పైగా కౌంటర్‌ ఎటాక్స్‌తో రష్యాకు వణుకు పుట్టిస్తోంది. రీసెంట్‌గా ఉక్రెయిన్‌ జరిగిన క్షిపణ దాడుల్లో 400 సైనికులను కోల్పోయింది రష్యా. భీకర దాడులతో రష్యా విరుచుకుపడుతోన్నా తగ్గేదేలే అంటోంది ఉక్రెయిన్‌. రష్యా దాడులను దీటుగా తిప్పికొడుతూ సై అంటే సై అంటూ సవాల్ విసురుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యాకు లొంగేదే లేదంటూ ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతోంది ఉక్రెయిన్‌. ఇప్పుడు రష్యాకి దీటుగా రివర్స్‌ ఎటాక్స్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ అమెరికా టూర్‌ తర్వాత స్పీడ్‌ పెంచింది ఆ దేశం. రష్యా బలగాలకు చుక్కలు చూపిస్తూ భీకర దాడులతో విరుచుకుపడుతోంది.

రీసెంట్‌గా ఉక్రెయిన్‌ జరిపిన దాడుల్లో 400 మంది రష్యన్‌ సైనికులు మరణించగా, మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా ఆక్రమించుకున్న డొనెట్స్‌ ప్రాంతంలో మిస్సైల్స్‌తో విరుచుకుపడింది ఉక్రెయిన్‌. మాస్కో సేనలు ఆశ్రయం పొందుతున్న ఓ భవనంపై క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఉక్రెయిన్‌ ఎటాక్‌లో పెద్దఎత్తన సైనికులను కోల్పోయింది రష్యా. ఉక్రెయిన్‌ చెబుతోన్న లెక్కల ప్రకారం 400 మంది రష్యన్‌ సైనికులు మరణించారు. అయితే, ఈ వార్తలను కొట్టిపారేస్తోంది రష్యా. ప్రాణనష్టం జరిగిన మాట నిజమే కానీ, ఉక్రెయిన్‌ చెబుతోన్న లెక్కలు మాత్రం అవాస్తవమంటోంది. న్యూఇయనర్‌ రోజు అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఊహించని స్థాయిలోనే ప్రాణనష్టం జరిగిందని చెబుతోంది. అయితే, ఎంతమంది మరణించారో తెలియాల్సి ఉందంటోంది. అమెరికన్‌ మేడ్‌ ఎంఎల్‌ఆర్‌ఎస్‌ హిమార్స్‌ మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌ ఈ దుశ్చర్యకు పాల్పడిందని అంటోంది రష్యా. మొత్తం 25 రాకెట్‌ దాడులు జరిగినట్టు చెబుతోంది. జెలెన్‌స్కీ అమెరికా పర్యటన తర్వాత పెద్దఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్‌ సమకూర్చుకుందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ క్షిపణి దాడులతో కేపిటల్‌ కీవ్‌పై పెద్దఎత్తున దాడులు చేస్తోంది రష్యా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!