Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flying Electric Car: గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేస్తోంది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం వెల్లొచ్చంటే..

హెలికాప్టర్, విమానం వంటివి గాలిలో ఎగురుతుంటాయి. కానీ ఎగిరే కార్లను ఎప్పుడైన చూశారా? ఏంటి ఇది ఏమైనా సినిమానా అనుకుంటున్నారా? కాదండి నిజమే మార్కెట్ లోకి త్వరలోనే ఎగిరే కార్లు వచ్చే అవకాశాలున్నాయి.

Flying Electric Car: గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేస్తోంది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం వెల్లొచ్చంటే..
Aska Flying Car
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2023 | 5:13 PM

సాధారణంగా కారు, బస్సు వంటివి రోడ్డుపై నడుస్తాయి. హెలికాప్టర్, విమానం వంటివి గాలిలో ఎగురుతుంటాయి. కానీ ఎగిరే కార్లను ఎప్పుడైన చూశారా? ఏంటి ఇది ఏమైనా సినిమానా అనుకుంటున్నారా? కాదండి నిజమే మార్కెట్ లోకి త్వరలోనే ఎగిరే కార్లు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే అమెరికాలో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)లో అస్కా అనే కంపెనీ ఈ తరహా ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించనున్నట్లు ప్రకటించుకుంది. ఇప్పటికే వివిధ ఆటోమోటివ్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ సీఈఎస్ షోలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించాయి. వీటిలో వోక్సవ్యాగన్ తన కొత్త ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్‌ను బహిర్గతం చేయనుండగా..ఆడి వర్చువల్ రియాలిటీ ద్వారా నడిచే వినోద వ్యవస్థను ప్రదర్శించనుంది. వీటితో పాటు అస్కా ఎగిరే వాహనాన్ని ప్రకటించడంతో ఆ షోపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఎగిరే కారు ఎలా ఉంటుందంటే..

నలుగురు ప్రయాణికులకు చోటు కల్పించే తన ఎగిరే వాహనాన్ని పబ్లిక్ రోడ్లపై నడపవచ్చని అస్కా ప్రకటించుకుంది . దీనిని జనవరి 5 నుంచి జనవరి 8 వరకు జరిగే 2023 CESలో ఈ వాహనం నమూనాను ఆవిష్కరించనుంది. రోడ్డుపై ఎలక్ట్రిక్ కారుగా నడవడంతో పాటు క్వాడ్‌కాప్టర్ గా కూడా గాలిలో ఎగురుతుందని పేర్కొంది. అయితే ఎంత కాలానికి ఈ కారును వినియోగదారులకు అందబాటులోకి తెస్తుందో ఆ కంపెనీ కచ్చితంగా చెప్పలేకపోయింది.

ఎగిరే ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్‌లు..

పూర్తి విద్యుత్ తో నడిచే ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. నలుగురు కూర్చొని ప్రయాణి చేయవచ్చు. గాలిలో ఎగురుతున్నప్పుడు వేగం 240 కిలీమీటర్ల ఉంటుంది. రోడ్డుపై రన్నింగ్ స్పీడ్ 112 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. VTOL (వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్), STOL (షార్ట్ టేకాఫ్ ల్యాండింగ్) టెక్నాలజీతో పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇదే కంపెనీ నుంచి మరో వాహనం..

CES 2023లో, చైనా డావిన్సీ DC100ని పరిచయం చేస్తోంది. ఇది సంప్రదాయ 1,000cc మోటార్‌ సైకిల్ తరగతికి పోటీగా రూపొందిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 200 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం మూడు సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఒకసారి చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. లెవల్ 3 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..