AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Bike: సైకిల్‌ను ఈ-బైక్‌గా మార్చే సింపుల్ టెక్నిక్.. జస్ట్ ఈ కిట్ ఒక్కటి చాలు.. పూర్తి వివరాలు ఇవిగో..

ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లు అన్నీ అధిక ధరను కలిగి ఉన్నవే. అంత ధరను భరించడం వినియోగదారులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో లండన్ లోని ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించింది.  సైకిల్ నే ఈ-బైక్ గా మార్చేందుకు ప్రయత్నించింది.

E-Bike: సైకిల్‌ను ఈ-బైక్‌గా మార్చే సింపుల్ టెక్నిక్.. జస్ట్ ఈ కిట్ ఒక్కటి చాలు.. పూర్తి వివరాలు ఇవిగో..
Swytch Bike
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 02, 2023 | 5:26 PM

Share

ఎలక్ట్రిక్ బైక్ ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు. భారీగా పెరిగిపోతున్న ఇంధన ధరలు, అధికమవుతున్న కాలుష్యం కారణంగా అందరూ ఈ-బైక్ ల బాట పడుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లు అన్నీ అధిక ధరను కలిగి ఉన్నవే. అంత ధరను భరించడం వినియోగదారులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో లండన్ లోని ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించింది.  సైకిల్ నే ఈ-బైక్ గామార్చేందుకు ప్రయత్నించింది. ఓ ప్రత్యేకమైన బ్యాటరీ, మోటార్ సాయంతో చిన్న కిట్ ను రూపొందించి, విజయవంతంగా ఇన్ స్టాల్ చేసింది. ప్రస్తుతం ఇది నెటిజనుల్లో హాట్ టాపిక్ మారింది.

స్విచ్.. సైకిల్ టు ఈ-బైక్

మీ సైకిల్ ను సులభంగా ఈ-బైక్ గా మార్చుకునే ఈ కిట్ ను లండన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘స్విచ్’ ఆవిష్కరించింది. ఈ కిట్ సాయంతో ఏవరైనా సులభంగా తమ సైకిల్ ను ఈ-బైక్ గా మార్చేసుకోవచ్చు. 98 kwh సామర్థ్యం కలిగిన బ్యాటరీ కిట్ 500 డాలర్లు కాగా.. 180 kwh సామర్థ్యం కలిగిన బ్యాటరీ కిట్ 800 డాలర్లకు ఆ స్విచ్ కంపెనీ విక్రయిస్తోంది.

చాలా సులభంగా..

స్విచ్ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓలివర్ మోంటేగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది చాలా సులభంగా సైకిల్ కి బిగించుకోవచ్చని చెప్పారు. వినియోగదారుల డబ్బును తమ ఉత్పత్తి ఆదా చేస్తుందని చెప్పారు. సైకిల్ టైర్ ఊడదీసి మళ్లీ బిగించకలిగిన ప్రతి ఒక్కరూ తమ కిట్ ను సైకిల్ కు బిగించుకొని ఆపరేట్ చేయవచ్చని వివరించారు. మోంటేగ్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ స్టూడెంట్ గా ఉన్న సమయం అంటే 2012 లో చిన్న స్టార్టప్ కంపెనీ ప్రారంభించి, ఈ-బైక్ ల కోసం అవసరమైన కిట్లను తయారు చేసి, ఆన్ లైన్ విక్రయించడం ప్రారంభించారు. ఐదేళ్ల తర్వాత దానిని మరింతగా విస్తరించారు.

ఇవి కూడా చదవండి

ఈజీగా ఆన్ అండ్ ఆఫ్..

ఈ కిట్ ను సైకిల్ బిగించిన తర్వాత చాలా సులభంగా ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చని స్విచ్ కంపెనీ కో ఫౌండర్ మోంటేగ్ ప్రకటించారు. దీనిని మోటర్ నుంచి పవర్ రాకుండా ఏది నిరోధించలేదని స్పష్టం చేశారు. అలాగే ఒక ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఈ-బైక్ లలో బ్యాటరీ తీసివేస్తే అది పనిచేయదు. కానీ సైకిల్ బిగించే స్విచ్ కంపెనీ కిట్ తో ఒక వేళ బ్యాటరీ తీసివేసినా.. ఆ ఈ-బైక్ లానే పనిచేస్తుందని మోంటేగ్ చెప్పారు. బ్యాటరీ లేకపోయిన మోటార్ పనితీరులో ఎటువంటి తేడా ఉండదని నొక్కి చెప్పారు.

మరిన్ని బెజినెస్ వార్తల కోసం..