- Telugu News Photo Gallery Viral photos Niagara water falls freezes due to blizzard see the most breathtaking views
Niagara Falls: గడ్డకట్టిన నయాగరా.. మంచు దుప్పటి కప్పుకుని శ్వేతవర్ణంతో ఆకట్టుకుంటున్న జలపాతం
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వేలాది విమానాలు రద్దు చేశారు. లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు లేకుండా జీవిస్తున్నారు. నీటి పైపులలో మంచు గడ్డకట్టింది.
Updated on: Jan 02, 2023 | 4:23 PM

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వేలాది విమానాలు రద్దు చేశారు. లక్షలాది మంది ప్రజలు విద్యుత్తు లేకుండా జీవిస్తున్నారు. నీటి పైపులలో మంచు గడ్డకట్టింది.

జీరో ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచంలో అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన నయాగరా కూడా గడ్డకట్టుకుపోయింది. ఎప్పుడూ ఉధృతంగా ప్రవహించే నయాగరా ఎటువంటి కదలికలు లేకుండా పూర్తిగా స్తబ్దుగా మారింది. అయితే నయాగరాలోని నీరు గడ్డకట్టుకుపోయినట్లు కనిపించినా లోపల నీటి ప్రవాహం ఉంటుంది.

ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటైన నయాగరా జలపాతం మంచు తుఫాను కారణంగా గడ్డకట్టింది. గడ్డకట్టిన నయాగరా జలపాతానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో ప్రవహించే మంచు కనిపిస్తుంది.

నయాగరా జలపాతం నయాగరా నదిపై ఉంది. ఇది US రాష్ట్రం న్యూయార్క్ , కెనడియన్ ప్రావిన్స్ ఒంటారియో మధ్య అంతర్జాతీయ సరిహద్దులో ప్రవహిస్తుంది.

జలపాతం గడ్డకట్టడం ఇదే మొదటిసారి కాదని చరిత్ర చెబుతోంది. 1902, 1906, 1911, 1932, 2014, 2017, 2018 కూడా నయాగరా స్తంభించిపోయింది. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది ఘనీభవిస్తుంది.

ఈసారి కనీవినీ ఎరుగని విధంగా మంచు తుఫాన్ అమెరికాని వణికిస్తుంది. డిసెంబర్ 25న ఆ దేశాన్ని కుదిపేసిన హిమపాతంతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

హిమపాతం కారణంగా ఇప్పుడు రిజర్వాయర్ కూడా శీతాకాలపు అద్భుత ప్రదేశంలా కనిపిస్తోంది. మైనస్ సున్నా ఉష్ణోగ్రతల కారణంగా, నయాగరా జలపాతం పాక్షికంగా స్తంభించిపోయింది.

మంచు తుఫాన్ కారణంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నయాగరా జలపాతం కూడా గడ్డకట్టింది. మంచు ముద్దలా గడ్డకట్టిన నయాగరా జలపాతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలో ఉష్ణోగ్రతలు -52 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. జనాభాలో 60 శాతం మంది చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు.





























