Empty Stomach: మర్చిపోయికూడా ఖాళీ కడుపుతో ఈ 4 ఆహారాలు తినకండి.. కోరి కోరి సమస్యలను ఆహ్వానించినట్లే!
ఉదయం నిద్రలేవగానే టీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌గా పోహా, సమోసా, ఆమ్లెట్, ఫ్రూట్ జ్యూస్‌లను ఆరగిస్తారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏదైనా తినే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నాలుగు రకాల ఆహారాలను మాత్రం..
Updated on: Jan 01, 2023 | 8:08 PM

ఉదయం నిద్రలేవగానే టీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌గా పోహా, సమోసా, ఆమ్లెట్, ఫ్రూట్ జ్యూస్‌లను ఆరగిస్తారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏదైనా తినే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నాలుగు రకాల ఆహారాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉదయం పరగడుపున తినకూడదట. అవేంటో తెలుసుకుందాం..

బేరి (పియర్) పండులోఉండే ముడి ఫైబర్ కడుపులోని సున్నితమైన శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది. బేరిని ఖాళీ కడుపుతో తింటే కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

పరగడుపున పెరుగు కూడా తినకూడదు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లత్వ స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో పాల ఉత్పత్తులను తీసుకుంటే, వాటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ పొట్టలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి, ఎసిడిటీని పెంచుతుంది.

అలాగే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం కూడా అంతమంచిది కాదు. వీటిని తాగడం వల్ల ప్యాంక్రియాస్‌పై అధిక భారం పడుతుంది.

ఖాళీ కడుపుతో మసాలాతో వండిన ఆహారాలు, కారం తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది.





























