- Telugu News Photo Gallery Pista for Diabetes: Expert Explains How Pistachios Can Help Control Blood Sugar Levels
Pista for Diabetes: డయాబెటిస్ బాధితులకు వరం పిస్తా.. రోజూ గుప్పెడు తింటే డబుల్ బెనిఫిట్స్.. అవేంటో తెలుసుకోండి..
పిస్తాలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పిస్తాలో ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహం వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
Updated on: Jan 01, 2023 | 9:46 PM

డ్రైఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అలాంటివాటిలో పిస్తా కూడా ఒకటి.. పిస్తా ఆహారం రుచిని మరింత పెంచుతుంది. ఖీర్, ఐస్ క్రీం వంటి వాటిల్లో పిస్తాలను జోడించడం వల్ల రుచి పెరుగుతుంది. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిస్తాలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పిస్తాలో ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహం వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

diabetes symptoms

పిస్తాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తా తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇది గుండెకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

పిస్తాలు ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. కాల్షియం ఎముకలలో నొప్పి సమస్యను కూడా తొలగిస్తుంది.

పిస్తాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరానికి బలాన్ని ఇచ్చే ప్రొటీన్లు కూడా ఇందులో మంచి పరిమాణంలో ఉంటాయి.

పిస్తాపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, లుటిన్ కళ్లకు మేలు చేస్తాయి. పిస్తా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.





























