- Telugu News Photo Gallery Cricket photos World cup 2023 Umran Malik to Hardik Pandya these 3 indian players may prove in odi format before odi world cup 2023
World Cup 2023: టీ20ల్లో దుమ్ము రేపారు.. వన్డేలో మాత్రం తుస్సుమన్నారు.. కఠిన పరీక్షకు సిద్ధమైన భారత యువ ఆటగాళ్లు..
ODI World Cup 2023: టీమిండియా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో వన్డే ఫార్మాట్‌లో తమను తాము నిరూపించుకోవాల్సిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 02, 2023 | 7:15 AM


ఎందుకంటే టీ20 ఇంటర్నేషనల్‌లో సందడి చేసిన చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కానీ, వారు ఇంకా వన్డే ఫార్మాట్‌లో తమను తాము నిరూపించుకోలేకపోయారు. అటువంటి పరిస్థితిలో, ప్రపంచకప్‌నకు ముందు జరిగే వన్డే మ్యాచ్‌లు ఈ యువ ఆటగాళ్లకు ఓ అగ్నిపరీక్షలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

1. హార్దిక్ పాండ్యా: భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లలో పాండ్యా ఒకడిగా పేరుగాంచాడు. అయితే వన్డే ఫార్మాట్‌లో అతను ఇంతవరకు నిరూపించుకోలేకపోయాడు. పాండ్యా వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే, భారతదేశం తరపున 66 వన్డేలు ఆడాడు. ఇందులో అతను 1386 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 8 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే ఇంతవరకు హార్దిక్ వన్డేల్లో సెంచరీ సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే ఫార్మాట్‌లో ప్రపంచకప్‌కు ముందు తానేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది.

2. సూర్యకుమార్ యాదవ్: భారత జట్టు స్టైలిష్ బ్యాట్స్‌మెన్, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్. టీ20ల్లో అతడిని ఇప్పటి వరకు ఏ జట్టు బౌలర్లు అడ్డుకోలేకపోయారు. అయితే టీ20లా, వన్డేల్లో సూర్య ప్రభావవంతంగా నిరూపించుకోలేకపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. సూర్య టీ20 లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కానీ, అతను వన్డేలలో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌నకు ముందు వన్డే ఫార్మాట్‌లో తన సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. ఇది సూర్యకు పెద్ద అగ్ని పరీక్షలా ఉంటుంది.

3. ఉమ్రాన్ మాలిక్: భారత జట్టు యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు వన్డే ప్రపంచ కప్ జట్టులో ఒక భాగంగా పేరుగాంచాడు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో తన ఫాస్ట్ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం అతడికి అంత బౌలింగ్ అనుభవం లేకపోయినా, ప్రపంచకప్‌నకు ముందు తనను తాను పరిణితి చేసుకుని ఈ ఫార్మాట్‌లో మెరుగవ్వాలని భావిస్తున్నాడు. ఉమ్రాన్ ఇప్పటివరకు భారత్ తరపున వన్డేల్లో 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు.





























