చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీ తాగుతారు. ఆ తరువాత అల్పాహారం తీసుకుంటారు. ఇక కొందరు ఉదయాన్నే పోహా, సమోసా, ఆమ్లెట్, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏదైనా తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఖాళీ కడుపుతో తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..