- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani and Sidharth Malhotra will get married in February says reports
ప్రేమపక్షుల పెళ్లికి ముహూర్తం ఫిక్స్! సిద్ధార్థ్, కియారాల డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అద్వానీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా వివాహంపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరి పెళ్లి కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Updated on: Jan 01, 2023 | 1:35 PM

ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అద్వానీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా వివాహంపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరి పెళ్లి కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 6 న వివాహం చేసుకోబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కత్రినా మరియు విక్కీ లాగానే ఈ ప్రేమపక్షులు కూడా రాజస్థాన్‌లో రాయల్ థట్టాలో వివాహం చేసుకోనున్నారు

మరోవైపు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి సన్నాహాలు జోరందుకున్నాయి. అయితే తమ వివాహంపై అటు కియారా కానీ, సిద్ధార్థ్ కానీ ఇంకా స్పందించలేదు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలెస్ హోటల్‌లో రాచరిక పద్ధతిలో వీరి పెళ్లి జరగనుంది. ప్రి వెడ్డింగ్ ఈవెంట్స్ తో పాటు మొత్తం మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయట.

కుటుంబసభ్యులు,సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు సిధ్, కియారా పెళ్లికి హాజరుకానున్నారట. జనవరిలో తమ పెళ్లి గురించి సిద్ధార్థ్, కియారాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందట.





























