Custard Apple: గుండె జబ్బులున్నవారు శీతాఫలం తింటే ఏమవుతుంది?
సీతాఫలం పండ్లు అంటే ఇష్టపడని వారుండరేమో! రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా సీతాఫలం ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో ఉండే విటమిన్ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు దరి చేరకుండా కాపాడుతుంది. శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఐతే ఈ పండుపై కొన్ని అపోహలున్నాయి. వాటిలో వాస్తవం ఎంతో తెలుసుకుందాం..
Updated on: Jan 02, 2023 | 9:38 PM

బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు సీతాఫలం తినకూడదని అనుకుంటారు. దీనిలోని ఫైబర్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా నివారిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుండేగానీ బరువు పెరగరని నిపుణులు అంటున్నారు.

గుండె జబ్బులున్న వారికి మంచిది కాదని కొంతమంది నమ్ముతారు. నిజానికి శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సీతాఫలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఖనిజాలు, విటమిన్ ‘సి’ రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

పీసీఓఎస్ ఉన్న వారిలో హార్మోన్ల అసమతుల్యతకు సీతాఫలం కారణం అవుతుందా? ఈ సమయంలో అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చికాకు వంటివి సర్వసాధారణం. ఐతే వీటన్నింటికీ ఐరన్ విరుగుడుగా పనిచేస్తుంది. సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే పీసీఓఎస్ ఉన్న వారూ ఈ పండు తీసుకోవడం మంచిది.

పోషకాలు అధికంగా ఉన్నటప్పటికీ.. అనారోగ్య సమస్యలున్నవారు సీతాఫలం అధికంగా తీసుకోకపోవడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.