- Telugu News Photo Gallery Indian Railway Launches New UTS App To Book General Train Ticket using on Mobile App
సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ! ఇకపై జనరల్ టికెట్ల కోసం క్యూలలో నిలబడక్కర్లేదు.. ఆన్‌లైన్‌లోనే..
రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ల కోసం బారులు తీరిన జనాలు పొడవాటి క్యూలలో నిల్చుని అవస్తలు పడుతుంటారు. సమయానికి టికెట్ దొరకక ట్రైన్ వెళ్లిపోయే పరిస్థితులు కూడా చాలా మంది చవిచూసి ఉంటారు. ఇకపై ఈ బాధలకు..
Updated on: Jan 03, 2023 | 9:20 PM

రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ల కోసం బారులు తీరిన జనాలు పొడవాటి క్యూలలో నిల్చుని అవస్తలు పడుతుంటారు. సమయానికి టికెట్ దొరకక ట్రైన్ వెళ్లిపోయే పరిస్థితులు కూడా చాలా మంది చవిచూసి ఉంటారు. ఇకపై ఈ బాధలకు ఉండడం రైల్వే శాఖ చెక్ పెట్టనుంది.

అందుకు అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ తీసుకొచ్చింది.

దీని ద్వారా కేవలం సెకన్ల వ్యవధిలో ఆ రోజుకు మాత్రమే జనరల్ రైలు టికెట్, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది.

స్మార్ట్ ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ జీపీఎస్ ఆధారంగా పని చేస్తుంది. దీని ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఇలా యాప్‌తో బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫారం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి.





























