Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Tourist Places: తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఇవే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవ్!

తమిళనాడు రాజధాని చెన్నై అత్యంత సుందరమైన నగరాలలో ఒకటి. ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పైగా తక్కవ బడ్జెట్‌లోనే చక్కగా చుట్టిరావచ్చు..

Srilakshmi C

|

Updated on: Jan 03, 2023 | 9:50 PM

తమిళనాడు రాజధాని చెన్నై అత్యంత సుందరమైన నగరాలలో ఒకటి. ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పైగా తక్కవ బడ్జెట్‌లోనే చక్కగా చుట్టిరావచ్చు.పులికాట్‌లో పులికాట్ సరస్సు, పులికాట్ అభయారణ్యం, డచ్ ఫోర్ట్, డచ్ స్మశానవాటిక చూడదగ్గ ప్రదేశాలు.

1 / 5
మామల్లపురం అని కూడా పిలువబడే మహాబలిపురం చెన్నై నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పురాతన చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పాలతో నిండిన పురాతన పట్టణం. 7వ శతాబ్దపు పల్లవ రాజవంశం కాలంలో నిర్మించిన చారిత్రాత్మక దేవాలయాలు, ఏకశిలా విగ్రహాలు, పురాతన కళాఖండాల మ్యూజియం చాలా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌. ఇక్కడ తీర్ ఆలయం, పంచ రథ, వరాహ, మహిషాసురమర్దిని, కృష్ణ గుహ దేవాలయాలు చూడదగ్గ ప్రదేశాలు.

2 / 5
నాగలాపురంకు నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే ప్రధాన ట్రెక్కింగ్ ప్రదేశం. పచ్చని కొండల మధ్య ట్రెక్కింగ్ చేయవచ్చు. చెన్నై నుంచి 70 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు.. శ్రీ వేద నారాయణ పెరుమాళ్ ఆలయం, నాగలాపురం జలపాతం.

3 / 5
కాంచీపురం వెయ్యి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం పల్లవ రాజవంశం నుంచి యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా ఉంది. కాంచీపురంలో చూడదగిన ప్రదేశాలు.. కంచి కైలాసనాథర్ ఆలయం, ఏకాంబరేశ్వరాలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం, కంచి కుడిల్ మ్యూజియం, వేదంతంగల్ బర్డ్ శాంక్చురి.

4 / 5
తిరుత్తణి.. చెన్నై నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2000 సంవత్సరాల నాటి తిరుత్తణి మురుగన్ ఆలయం సందర్శించడానికి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. తిరుత్తణిలో చూడదగిన ప్రదేశాలు.. తిరుత్తణి మురుగన్ ఆలయం, తిరుత్తణి కొండ, శాంతిపురి ఆలయం.

5 / 5
Follow us