- Telugu News Photo Gallery Priyanka Gandhi and Farroq Abdullah joins Bharat Jodo Yatra as Rahul Gandhi Resumes it on Tuesday
Bharat Jodo Yatra: యూపీలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర.. స్వాగతించిన ప్రియాంక గాంధీ, ఫరుక్ అబ్దుల్లా.. వైరల్ అవుతున్న ఫోటోలు..
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర యాత్ర తొమ్మిది రోజుల విరామం తర్వాత ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వద్ద ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీని ఆయనతో పాటు ఉన్న ఇతర యాత్రికులకు స్వాగతం పలికారు. అదే క్రమంలో ఫరుక్ అబ్దుల్లా సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ యాత్రలో భాగమయ్యారు.
Updated on: Jan 03, 2023 | 9:19 PM

కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర యాత్ర తొమ్మిది రోజుల విరామం తర్వాత ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వద్ద ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీని ఆయనతో పాటు ఉన్న ఇతర యాత్రికులకు స్వాగతం పలికారు.

తొమ్మిది రోజుల తర్వాత ప్రారంభమైన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పలువురు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఫరూక్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంకా ఆయన సోదరి ప్రియాంక వాద్రాను కౌగిలించుకున్నారు. ఆ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జోడో యాత్రకు తన మద్దతు ఇచ్చాడు.

జోడో యాత్ర మంగళవారం ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వద్ద యూపీలోకి ప్రవేశించిన తర్వాత.. ఫరుక్ అబ్దుల్లా కొంత దూరం పాటు యాత్రలో భాగమయ్యారు.

కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని యోధుడిగా అభివర్ణించారు. అదే క్రమంలో తన అన్నయ్య సత్యం అనే కవచాన్ని ధరిస్తున్నారని, అందుకే చలిలో కూడా దృఢంగా కనిపిస్తున్నారని ఆమె పేర్కోన్నారు. ఇంకా ‘ నా అన్నయ్య పట్ల నేను చాలా గర్వపడుతున్నాను’ అని అన్నారు.

యాత్రలో భాగంగా అన్నచెల్లళ్ల మధ్య ప్రేమానురాగాలు కూడా విరబూసాయి. ఆ క్రమంలోనే రాహుల్ ప్రియాంకను కౌగిలించుకుని సరదాగా ముద్దు పెట్టుకున్నారు.





























