- Telugu News Photo Gallery Switzerland’s new hydro plant with capacity to charge 400,000 car batteries
Switzerland: ఒకేసారి 4 లక్షల ఎలక్ట్రిక్ కార్లను చార్జ్ చేయగల పెద్ద బ్యాటరీ.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్విట్జర్లాండ్‌లో 14 ఏళ్ల నిరంతర ప్రయత్నాల తర్వాత వాటర్ బ్యాటరీని తయారు చేశారు ఆ దేశంవారు. దీని ప్రత్యేక ఏమిటంటే ఏకకాలంలో 4 లక్షల ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి దీని శక్తి సరిపోతుంది. ఇది ఎలా పని చేస్తుంది.. ఎక్కడ ఉంది అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 03, 2023 | 9:14 PM

ఒక్క బ్యాటరీతో నాలుగు లక్షల ఎలక్ట్రిక్ కార్లను చార్జ్ చేయగలమని చెబితే నమ్మడం కష్టమే అయినా ఇది అక్షర సత్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆచరణలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో స్విట్జర్లాండ్‌లోని ఈ ‘వాటర్ బ్యాటరీ’ కూడా ఒక భాగమే. దాని పేరు. 14 ఏళ్ల నిరంతర శ్రమ తర్వాత స్విట్జర్లాండ్‌లో ఈ విశేషనీయమైన బ్యాటరీని తాయరు చేశారు. దీనిలోకి శక్తి ఏకకాలంలో నాలుగు లక్షల ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి సరిపోతుంది.

ఈ వాటర్ బ్యాటరీ 20 మిలియన్ కిలోవాట్ల విద్యుత్‌ను నిల్వ చేయగలదు. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ కొండ లోతుల్లో ఉన్న 900 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్లలో ఈ బ్యాటరీ హైడ్రో-ఎలక్ట్రిక్ శక్తిని నిల్వ చేస్తుంది. ఇది వేర్వేరు ఎత్తులున్న రెండు నీటి కొలనుల మధ్య నిర్మితమైన ఈ వాటర్ బ్యాటరీ ప్లాంట్‌లో.. దిగువ కొలను నుంచి ఎగువ కొలనుకు నీటిని పంపడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనినే హైడ్రో-ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటారు. ఈ నీటి ప్రవాహం హైడ్రో టర్బైన్‌లను నడపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పూర్తి స్థాయిలో నీటిని పంపింగ్ చేసిన తర్వాత.. 5 నిమిషాల్లో టర్బైన్‌ను దాని పూర్తి సామర్థ్యంతో నడుపుతారు. ఈ పవర్ ప్లాంట్ అనేక విధాలుగా ఇతర ప్లాంట్ల కంటే మెరుగైనదని చెప్పుకోవచ్చు. పవన, సౌర శక్తి ప్లాంట్ల కంటే చాలా స్థిరమైన విద్యుత్‌ను అందించడానికి ఇది పనిచేస్తుంది. దీని కారణంగా తక్కువ విద్యుత్తు వృధా అవడమే కాక దీని నిర్వహణకు పెద్దగా ఖర్చు అవసరం లేదు.

స్విట్జర్లాండ్‌లో ఉన్న ఈ వాటర్ బ్యాటరీని సిద్ధం చేయడానికి 2 బిలియన్ యూరోల ఖర్చయిందని పలు వార్త కధనాలు తెలుపుతున్నాయి. స్విట్జర్లాండ్ మొత్తం విద్యుత్ అవసరాలలో నాలుగో వంతును ఈ వాటర్ ప్లాంట్ నుంచే అందుతుంది. ఆ దేశంలోనివారు జలవిద్యుత్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల చమురు, గ్యాస్ ధరలపై పెద్దగా ప్రభావం పడలేదు. ఫలితంగా ఇంధనం కోసం ఇతర దేశాల చమురు,గ్యాస్‌పై ఆధారపడే పరిస్థితి ఆ దేశానికి తగ్గింది.

స్విట్జర్లాండ్‌కు ఈ వాటర్ ప్లాంట్ ఎంతో ప్రముఖమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యవసర సమయంలో ఆ దేశంలోని ఇళ్లకు ఈ ప్లాంట్ నుంచే విద్యుత్ అందుతుంది. ఎనర్జీకి డిమాండ్ పెరిగినప్పుడు కూడా ఓవర్‌లోడ్ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈ ప్లాంట్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.





























