- Telugu News Photo Gallery Cricket photos Ind vs sl shivam mavi debut 4 reasons check here india vs sri lanka 1st t20i
Shivam Mavi: జట్టులో చోటు.. ఆ వెంటనే అరంగేట్రం చేసే లక్కీ ఛాన్స్.. శివమ్ మావి ఎంట్రీ వెనుక 4 కారణాలు..
IND vs SL: ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి మొదటిసారిగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై టీ20లో ఆడే అవకాశం కూడా పొందాడు.
Updated on: Jan 03, 2023 | 7:57 PM

శ్రీలంకతో జరిగే ముంబై టీ20లో టీమిండియా ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా శుభమన్ గిల్, శివమ్ మావిలకు అవకాశం ఇచ్చాడు. శుభ్‌మాన్ గిల్ అరంగేట్రం చేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ ఆటగాడు గత ఏడాది కాలంగా బాగా రాణిస్తున్నాడు. అయితే శివమ్ మావి మొదటిసారిగా టీమ్ ఇండియాలో స్థానం సంపాదించాడు. అతనికి కూడా మొదటి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇది చాలా మందికి షాకింగ్ విషయంగా మారింది. మరి ఇంత త్వరగా మావికి ఎందుకు అవకాశం ఇచ్చారనేది ఇప్పుడు ప్రశ్నగా నిలిచింది.

సాధారణంగా జట్టులో ఆటగాడు ఎంపికైనప్పుడల్లా అతడిని బెంచ్‌పై కూర్చోబెడుతుంటారు. టీమ్‌లో కలపడానికి అవకాశం ఇస్తారు. కానీ మావి విషయంలో అలా జరగలేదు. మరి శివమ్ మావికి ఆడేందుకు అవకాశం రావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శివమ్ మావి వికెట్ టేకర్: శివమ్ మావి వికెట్ టేకర్‌గా మారిన ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. మావి టీ20లో 46 వికెట్లు తీశాడు. అదే సమయంలో, ఈ ఆటగాడు 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏలో మావికి 59 వికెట్లు ఉన్నాయి.

పేస్ కం గుడ్ స్లోయర్ బాల్: శివం మావి 145 కి.మీ. గంట వేగంతో బౌలింగ్ చేయగలడు. ఇది కాకుండా, అతని వద్ద అత్యుత్తమ స్లోయర్ బాల్ కూడా ఉంది. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేయగల సత్తా మావికి ఉంది.

బ్యాటింగ్‌లోనూ సూపర్: చివర్లో వచ్చి కొట్టగల ఇలాంటి బౌలర్ల కోసం టీ20 జట్టులో టీమ్ ఇండియా తీవ్రంగా వెతుకుతోంది. ఇందులో శివమ్ మావి నిపుణుడు. ఈ ఆటగాడు స్లాగ్ ఓవర్లలో బ్యాట్‌తో సహకారం అందించగలడు.

అర్ష్‌దీప్ అన్ ఫిట్: శివమ్ మావికి అవకాశం రావడానికి అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌నెస్ కూడా ఒక కారణం. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అనారోగ్యంతో ఉన్నాడని, అందుకే అతన్ని ముంబై T20 ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చలేదని హార్దిక్ పేర్కొన్నాడు.





























