- Telugu News Photo Gallery Cricket photos Team India Cricketer Prithvi Shaw celebrates New Year Party With His Girl Friend Nidhhi Tapadiaa
హీరోయిన్‌తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా క్రికెటర్.. వైరలవుతోన్న ఫొటోలు
తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్, మిస్టరీ గర్ల్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు షా. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Updated on: Jan 03, 2023 | 8:52 AM

యంగ్ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడకపోవచ్చు. కానీ క్రికేటేతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు

తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్, మిస్టరీ గర్ల్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ ఫొటోల్లో షాతో ఉన్న మిస్టరీ గర్ల్ మరెవరో కాదు, మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నటి నిధి తపాడియా. సోషల్ మీడియాలో టపాడియాకు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ మొత్తం తన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫొటోలే ఉంటాయి.

కొన్ని రీజినల్ మూవీస్, మ్యూజిక్ వీడియోలలో నటించిన నిధి తపాడియా సీఐడీ సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యింది.

2021 జూలైలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో చివరిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు పృథ్వీషా . అప్పటి నుంచి బీసీసీఐ పిలుపు కోసం వేచి చూస్తున్నాడు.




