AP Crime News: ‘నా గొంతు కోశావు కదా, నీ గొంతు కోస్తా’ భర్త గొంతు కోసిన భార్య

భర్త గొంతును కోసి పగ తీర్చుకుంది ఓ తెలుగింటి ఇల్లాలు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురానికి ప్రశ్నించగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకొచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

AP Crime News: 'నా గొంతు కోశావు కదా, నీ గొంతు కోస్తా' భర్త గొంతు కోసిన భార్య
AP Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2023 | 3:58 PM

భర్త గొంతును కోసి పగ తీర్చుకుంది ఓ తెలుగింటి ఇల్లాలు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురానికి ప్రశ్నించగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకొచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా, గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవి దంపతులు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అయిన బ్రహ్మయ్య డిసెంబర్ 25న భార్య గొంతు కోశాడు. బంధువులు ఆమెను హుటాహుటీన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ఆసుపత్రికి తరలించగా కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. నాటి నుంచి బ్రహ్మయ్య తప్పించుకొని తిరగసాగాడు.

ఈ క్రమంలోనే కొబ్బరి నీళ్ల కోసమని ఆసుపత్రి బయటకు వచ్చిన లక్ష్మీదేవికి ఆసుపత్రి ఆవరణలో బ్రహ్మయ్య కనిపించాడు. తన గొంతు కోసిన తర్వాత నుంచి కనిపించని భర్త.. ఆకస్మాత్తుగా కనిపించటంతో ఆమెకు అనుమానం కలిగింది. పైగా ముసుగు ధరించి, చేతిలో బ్లేడుతో ఉన్న బ్రహ్మయ్యను చూడగానే బాధిప మహిళకు అనుమానం కలిగింది. తనను మళ్లీ చంపేందుకు వచ్చాడేమోననే భయంతో బ్రహ్మయ్య వద్దకు వెళ్లి అతని చేతిలో ఉన్న బ్లేడునే తీసుకుని, అతని గొంతునే కోసేసింది. ప్రసుత్తం బ్రహ్మయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.