TS Police Exam Dates: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే.. హాల్‌టికెట్లు ఎప్పుడంటే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు తుది పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్ ప్రకారం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు తుది పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకూ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 5వ తేదీ వరకు పీఎంటీ, పీఈటీ పరీక్షలు పూర్తవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను త్వరలో విడుదల చేయనున్నారు.
తాజా హెడ్యూల్ ప్రకారం..
- మార్చి 23వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్సై పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకూ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో విభాగంలో ఏఎస్సై పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్ష ఉంటుంది.
- మార్చి 26వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో ఎస్సై పోస్టులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది.
- ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ డ్రైవర్లు, డ్రైవర్ ఆపరేటర్లు (కానిస్టేబుల్స్) పరీక్షకు టెక్నికల్ పేపర్ పరీక్ష జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.:0 వరకూ మెకానికల్ (కానిస్టేబుల్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్ష ఉంటుంది.
- ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సివిల్, ఐటీ, ఫింగర్ ప్రింట్స్ వంటి అన్ని విభాగాల్లోని ఎస్సై, ఏఎస్సై పోస్టులకు అర్థమెటిక్, టెస్టాఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకూ అన్ని విభాగాల్లోని ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌పై పరీక్ష నిర్వహిస్తారు.
- ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సివిల్‌తో పాటు ఇతర అన్ని విభాగాల ఎస్సై స్థాయి పోస్టులకు జనరల్ స్టడీస్‌లో పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకూ సివిల్‌తో పాటు ఇతర అన్ని విభాగాల్లో ఎస్సై స్థాయి పోస్టులకు తెలుగు, ఉర్దూ ల్యాంగ్వేజులపై పరీక్ష నిర్వహిస్తారు.
- ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ సివిల్, రవాణా, ఆబ్కారీ శాఖలతో పాటు ఇతర అన్ని విభాగాల్లోని కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు జనరల్ స్టడీస్‌లో పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం కానిస్టేబుల్ పోస్టులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.