CM KCR: విశాఖ ఉక్కుపై, ఆంధ్రా రాజకీయాల్లోకి ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్.. ఏమన్నారంటే..?

దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపచేసే పనిలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా ఆంధ్రాపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌కు..

CM KCR: విశాఖ ఉక్కుపై, ఆంధ్రా రాజకీయాల్లోకి ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్.. ఏమన్నారంటే..?
Telangana CM KCR Conducted a Press met to address AP cadre At BRS Bhavan on Jan 2
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 02, 2023 | 9:47 PM

దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపచేసే పనిలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా ఆంధ్రాపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలను అందజెప్పారు కేసీఆర్. ఇప్పటికే పలువురు ఏపీ నేతలకు పార్టీ కండువా కప్పిన కేసీఆర్ ఆంధ్రా కోసం పలు కీలక ప్రకటనలు చేశారు.ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసినప్పటికీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాతియీకరణ చేస్తామని, దేశంలో మార్పు కోసం ఏపీ కూడా భాగస్వామి కావాలని, బీఆర్‌ఎస్ పెట్టింది తమాషాల కోసం కాదు.. ఇండియా కోసం, ఇండియా అభివృద్ధి కోసం అంటూ ఏపీ నాయకులను ఉత్సాహపరిచారు కేసీఆర్‌. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

అంతకు ముందుగానే అనేక మంది ఏపీ నాయకులు కేసీఆర్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారందరికీ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు చేరిన ఏపీ రాజకీయ నేతలలో రావెల కిషోర్ బాబు, తోట రమేష్‌ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావు, చింతల పార్థసారథి, టీజే ప్రకాష్ ఉన్నారు. ఆంధ్రాలో తన పార్టీని విస్తరించే పనుల్లో ఉన్న కేసీఆర్ ఈ నేతలపై పెద్ద బాధ్యత పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ భవన్ ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘భారత దేశం ఏదశకు చేరుకోవాలో ఆ దశకు చేరుకోలేదు. బీఆర్‌ఎస్‌ అజెండాను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నేతలు చేరుతున్నారు. స్వాతంత్య్ర ఫలాలు పూర్తి స్ధాయిలో సిద్ధించలేదు. వాటిని సిద్ధింపజేసేందుకే బీఆర్ఎస్ ఆవిర్భావించింది. బీఆర్‌ఎస్‌ అంటే తమాషా కోసం కాదు.. బీఆర్‌ఎస్‌ ఫర్‌ ఇండియా’ అని అన్నారు.

రాజకీయాలు మారిపోయాయి..

ఇవి కూడా చదవండి

ఇంకా తన మాటలను కొనసాగిస్తూ..‘దేశంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి మారింది. మతకల్లోలాలు, డబ్బులు కురిపించి, కులాల కుప్పట్లు, ఏమిచేసినా ఎన్నికల్లో గెలవడమే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన రైతు ధర్నాలో 7వందల మంది మరణిస్తే పాలకులు పట్టించుకోలేదు.  మేధావుల సలహాలు స్వీకరించే ఆలోచనలో ఇవాళ్టి రాజకీయ నాయకులు లేరు. ఎమ్మెల్యే కాగానే నెత్తికి కళ్ళొస్తాన్నాయి.. బాషా మారిపోతోంది. దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవస్థికృత పనులు జరగాలి. సింగపూర్‌లో సొంతంగా మంచినీళ్లు లేవు..అయినా అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇండియాలో గడ్డం గీసుకునే బ్లెడ్ నుంచి దారాలు, వియణకుని బొమ్మలు అన్ని చైనా నుంచే రావాల్సిన పరిస్థితి ఉంద’న్నారు.

బీఆర్ఎస్ భవన్ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ తన మాటలను ఇంకా కొనసాగిస్తూ ‘మేక్ ఇన్ ఇండియా ఏమైంది.. అసలు మేక్ ఇన్ ఇండియా అనేదే ఉంటే గల్లికో చైనా బజార్ ఎందుకు? మేక్ ఇన్ ఇండియా ఉంటే.. భారత్ బజార్ ఉండాలి కదా? సీరియస్ కేంద్ర ప్రభుత్వం ఉంటే గల్లికో భారత్ బజార్ కట్టొచ్చు. 70వేల టీఎంసీల నీళ్లు ఇండియాలో ఉన్నాయి.. అయినా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇండియాలో నీటి యుద్ధం, పవర్ కష్టాలు బ్యాడ్ పాలసీల వల్లే జరుగుతున్నాయి. తెలంగాణలో 24 గంటల కరెంట్ కేసీఆర్ స్విచ్‌లో వేలు పెడితే రాలేదు.. కష్టపడితే వచ్చింది. అభివృద్ధి చెందాలంటే సాకులు చెప్పొద్ద’న్నారు.

సంక్రాంతి తరువాత కార్యాచరణ ప్రారంభం

సంక్రాంతి తర్వాత కార్యచరణ ప్రారంభిస్తామన్న కేసీఆర్.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు ఏళ్లలోనే దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఉచిత కరెంటు అందించి, దళిత బంధు కూడా అమలు చేస్తామన్నారు. ఇంకా బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసినా… బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాతియీకరణ చేస్తామన్నారు ఆయన. దేశంలో మార్పు కోసం ఏపీ కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్‌.. రాష్ట్రంలో అంతా మేమే అని భావన పోయి.. అసలు సిసలైన ప్రజా రాజకీయాలు రావాలన్నారు. బీఆర్‌ఎస్ పెట్టింది తమాషాల కోసం కాదు.. ఇండియా కోసం, ఇండియా అభివృద్ధి కోసం అంటూ ఏపీ కేడర్‌ని ఉత్సాహపరిచారు కేసీఆర్‌.

అసలు బీఆర్‌ఎస్ ఎందుకు పెట్టాం, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలనే దానిపై నేతలకు త్వరలో క్లాసులు కూడా ఉంటాయన్నారు కేసీఆర్‌. వీటికి కోసం లెక్చరర్లు కూడా ఉంటారని చెప్పారు. రాజకీయాలంటే ఆటలు కాదు, అదో టాస్క్ అని పేర్కొన్న కేసీఆర్.. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే ఇవాళా రేపు రాజకీయాల లక్ష్యమైందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!