Andhra Pradesh: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు .. వాళ్లు చేయగా లేనిది, వీళ్లు చేస్తే తప్పేందంటూ..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని భారత రాష్ట్ర సమితిపై వ్యంగ్యాస్త్రాలతో స్పందించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ..
ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని భారత రాష్ట్ర సమితిపై వ్యంగ్యాస్త్రాలతో స్పందించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ క్రమంలోనే రానున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయడంపై కూడా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమన్న పేర్ని నాని.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కేఏ పాల్ పార్టీ కూడా పోటీ చేస్తుందన్నారు. అలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పేంటని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని, వీళ్లా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది అని ఆయన నిలదీశారు.
ఆ క్రమంలోనే తెలంగాణ నేతల గురించి మాట్లాడుతూ ‘ఏపీలో కేసీఆర్ ఏం చేస్తారు..? ఏపీని వాళ్లేంటి ఉద్దరించేది! శ్రీశైలం, సాగర్, పులిచింతలలో దొంగ కరెంట్ తీసుకోవడం లేదా..? ఏపీకి వెన్నుపోటు పొడుస్తోంది ఎవరు? వాళ్లా ఏపీని ఉద్దరించేది? కొంచెమైనా సిగ్గుండాలి. మా ఆస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా? మా ఆస్తుల్ని తీసేసుకున్నారు. విద్యుత్ బకాయిలు కట్టారా..? ఏపీకి ద్రోహం చేసి ఇప్పుడు మాట్లాడతారా! ఏదైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలి’ అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీపై మంత్రి రోజా స్పందన:
కాగా, పేర్ని నాని కంటే ముందుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రానున్న ఏపీ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పందించారు. ‘ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చెయ్యొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ని అన్యాయంగా విభజించారు. ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఆ పార్టీ వాళ్ళు ఏపీకి రావాల్సిన వాటిపై ముందుగా సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఓటుకు నోటు కేసుని అడ్డం పెట్టి ఏపీకి నష్టం చేశారు. పార్టీ పెట్టినోళ్లు, పార్టీలో చేరే వాళ్ళు ముందు వాటిపై మాట్లాడాలి’ అని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..