- Telugu News Photo Gallery Massive price Drop on Nothing Phone 1 from Rs 37,999 to Rs 9,999 on Flipkart and get details more
Nothing Phone 1 Price Drop: నథింగ్ ఫోన్ 1 పై రూ. 10 వేల ధర తగ్గింపు.. అద్దిరిపోయే ఆఫర్లతో అద్భుతమైన ఫీచర్లు.. పూర్తి వివరాలివే..
ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారమవుతోన్న నథింగ్ ఫోన్1 ధర భారీగా తగ్గింది. రూ. 37,999 ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో 29,999 రూపాయలకే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 1(8GB+128GB) మోడల్ ప్రస్తుత ధర రూ. 29,999.
Updated on: Jan 02, 2023 | 7:28 PM

ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారమవుతోన్న నథింగ్ ఫోన్1 ధర భారీగా తగ్గింది. రూ. 37,999 ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో 29,999 రూపాయలకే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 1(8GB+128GB) మోడల్ ప్రస్తుత ధర రూ. 29,999. ఈ ఫోన్ కొనుగోలులో ఎక్స్ఛేంజ్ తగ్గింపు ధర రూ. 20,000 వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫర్‌లలో భాగంగా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉన్నవారు 5 శాతం క్యాష్‌బ్యాక్‌కు అర్హులు.

ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ EMI చాయిస్‌లతో కూడా అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 1 మొదటి నెల నో-కాస్ట్ EMI ధర రూ. 4,584. ఇంకా కొనుగోలుదారులు Discovery+ మెంబర్‌షిప్‌పై 25 శాతం తగ్గింపును అందుకుంటారు.

నలుపు, తెలుపు రంగులతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో అత్యాధునిక గ్లిఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంది. 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాలు ఉన్న ఈ నథింగ్ ఫోన్ పూర్తి HD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్‌తో పాటు వెనుకవైపు డ్యూయల్ 50 MP మోడర్న్ సెన్సార్, Qualcomm Snapdragon 778+ ఆక్టా-కోర్ ఇంజన్, Sony IMX766 ఫ్లాగ్‌షిప్ కెమెరాతో ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అంతేకాక ఫోన్‌లో సీన్ డిటెక్షన్, నైట్ మోడ్ ఉన్నాయి.

సెల్ఫీలు తీసుకోవడానికి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్న నథింగ్ ఫోన్1 బ్యాటరీ లైఫ్ ఒక్కో ఛార్జ్‌కు 18 గంటల వరకు వస్తుందని నథింగ్ కంపెనీ తెలిపింది. చార్జింగ్ విషయంలో కేవలం ముప్పై నిమిషాల్లో సున్నా నుంచి యాభై శాతం ఛార్జ్ చేస్తుందని కూడా పేర్కొంది.





























